Actress Sneha: అందం అభినయం ఉన్న హీరోయిన్స్ లో స్నేహ మొదటి వరుసలో ఉంటుంది. నిండైన చీరకట్టు ,అద్భుతమైన ముఖవర్చస్సుతో అచ్చ తెలుగు ఆడపడుచులానే ఆమె కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన స్నేహ తొలివలపు అనే సినిమాతో హీరోయిన్ గాఎంట్రీ ఇచ్చింది. గోపీచంద్ మొదటి సినిమా కూడా అదే. అయితే ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందివ్వలేకపోయినా అవకాశాలను అయితే అందించింది. ఆ తరువాత ప్రియమైన నీకు సినిమాతో స్నేహ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత స్నేహ తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది.
ఇప్పటివరకు గ్లామర్ ఒలకబోయకుండా ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది స్నేహ. శ్రీరామదాసు, రాధాగోపాళం, సంక్రాంతి లాంటి సినిమాలతో ఆమె తెలుగులో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా సావిత్రి, సౌందర్యల తరువాత అంతటి గొప్ప నటిగా గుర్తింపు అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కోలీవుడ్ నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రసన్న- స్నేహకు ఇద్దరూ పిల్లలు. వారు కొద్దిగా పెరిగిన తర్వాత స్నేహరీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తెలుగులో వినయ విధేయ రామ, సన్నాఫ్ సత్యమూర్తి ఇలాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం అటు తమిళ్ ఇటు తెలుగు సినిమాల్లో సపోర్టివ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్న స్నేహ ఇంకో పక్క కొన్ని షోస్ కు జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ తన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. గత కొన్ని రోజుల క్రితం ఆమె తన భర్త ప్రసన్నతో విడిపోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే దానికి కారణం ప్రసన్న- స్నేహ ఇద్దరు ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడమే. ఇక కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో విడాకుల విషయమై స్నేహ స్పందించింది.
Rehana Begum: సీరియల్ నటి దారుణం.. భర్త ఉండగానే డబ్బుకోసం ఇంకొకరిని.. ?
కొన్ని పనుల వల్ల తాము బిజీగా ఉండడంతో కలిసి ఉన్న ఫొటోస్ పెట్టడం లేదని అంతేతప్ప తాము విడిపోలేదని క్లారిటీ ఇచ్చింది. ఇక తమిళ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న స్నేహ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. ఎంత స్టార్స్ అయినా కూడా వారికంటూ ఒక ఫేవరెట్ స్టార్ ఉంటారని ఆమె చెప్పకు వచ్చింది. తమిళ్ లో స్టార్ హీరోలందరితో కలిసి పనిచేసిన స్నేహకు వారందరిలో తనకు అజిత్ అంటే ఇష్టమని తెలిపింది. తమిళ్ లో విజయ్, అజిత్, కమల్, సూర్య, ప్రశాంత్, ధనుష్ ఇలా స్టార్ హీరోలు అందరితోనూ కలిసి పని చేసినా కూడా తనకు మాత్రం అజిత్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో కలిసి నటించే అవకాశం మరోసారి వస్తే బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చింది . ప్రస్తుతం స్నేహ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అజిత్ ముందు ముందు సినిమాల్లో స్నేహకు ఏదైనా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.