E-Paper
Advertisement

Chinese Painter: 87 ఏళ్ల వయసులో తండ్రి అయిన చైనీస్ పెయింటర్, భార్య ఏజ్ 37 ఏళ్లు!

Chinese Painter: 87 ఏళ్ల వయసులో తండ్రి అయిన చైనీస్ పెయింటర్, భార్య ఏజ్ 37 ఏళ్లు!
Advertisement

Chinese Painter Fan Zeng: ఫ్యాన్ జెంగ్.. చైనా ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ చిత్రకారులలో అగ్రగణ్యుడు. తాజాగా ఆయన ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. 87 ఏళ్ల వయసులో తండ్రి అయినట్లు ప్రకటించాడు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. తన 37 ఏళ్ల తన భార్య జు మెంగ్ కొడుకును కన్నట్లు చెప్పుకొచ్చాడు. తన భార్య, కొడుకుతో కలిసి కొత్త ఇంట్లోకి వెళ్లినట్లు చెప్పాడు. వయసు పెరిగిన నేపథ్యంలో తన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తిగా జుకు అప్పగిస్తున్నట్లు చెప్పాడు. జుతో కలిగిన కొడుకు తన ఏకైక సంతానంగా ప్రకటించాడు.

ఫ్యాన్ నాలుగో భార్య జు!

నిజానికి ఫ్యాన్.. జు కంటే ముందు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయనకు ఇప్పటికే కూతురు ఫ్యాన్ జియావోహుయ్, పెంపుడు కుమారుడు ఫ్యాన్ జోంగ్డా ఉన్నాడు. రీసెంట్ గా వారందరితో సంబంధాలను కంప్లీట్ గా తెంచుకున్నట్లు ప్రకటించాడు. జు మినహా మిగతా ముగ్గురు భార్యలు, వారి పిల్లలకు తనకు ఇకపై ఎలాంటి సంబంధం ఉండబోదని వెల్లడించాడు. గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు తన కుటుంబ మీద అనవసర పుకార్లు సృష్టిస్తున్నారని తెలిపాడు. కొంతమంది తనకు హాని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. ఇకపై తన భార్య జు, ఆమెతో కలిగిన తన కొడుకు మినహా మరెవరూ తన పేరును ఉపయోగించకూడదన్నాడు. మిగతా పిల్లలకు తన విషయంలో ఇకపై ఎలాంటి అధికారాలు ఉండవచని చెప్పుకొచ్చాడు.

గత కొంతకాలంగా కుటుంబ వివాదాలు

Advertisement

నిజానికి ఫ్యాన్ జెంగ్ గత కొద్ది సంవత్సరాలుగా కుటుంబంలో వివాదాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం ఫ్యాన్ కూతురు  జియావోహుయ్.. జుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తన తండ్రిని కలవనివ్వడం లేదని చెప్పుకొచ్చింది. ఆయనను తన ఆధీనంలో ఉంచుకుని లేనిపోని ప్రకటనలు చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, తన తండ్రికి చెందిన 2 బిలియన్ యువాన్లు.. భారత కరెన్సీలో సుమారు రూ. 2,400 కోట్ల విలువైన కళాఖండాలను జు రహస్యంగా అమ్ముకుందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఫ్యాన్ జెంగ్ సంస్థ ఖండించింది.

చైనాలోని ప్రముఖ కళాకారుడిగా ఫ్యాన్ గుర్తింపు

ఫ్యాన్ జెంగ్.. జియాంగ్సు ప్రావిన్స్‌ లో జన్మించాడు. బీజింగ్‌ సెంట్రల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌ లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. చైనీస్ ప్రముఖ కళాకారులు లి కెరన్, లి కుచన్ నేతృత్వంలో కళాఖండాలు తీర్చి దిద్దడం నేర్చుకున్నాడు. కొద్ది సంవత్సరాల పాటు మెళకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా పెయింటింగ్స్ వేయడం మొదలు పెట్టాడు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన అంతర్జాతీయ పెయింటింగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. గొప్ప కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, ఇప్పుడు ఆయన కుటుంబ వివాదాల్లో చిక్కుకుపోయాడు. ప్రస్తుతం ఆయన నాలుగో భార్య జుతో కలిసి జీవిస్తున్నాడు.

Advertisement

Read Also:  నా ప్రియురాలితో గడపాలి.. లీవ్ ఇవ్వండి, ఎంప్లాయ్ రిక్వెస్ట్‌ కు మేనేజర్ స్పందన ఇదే!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×