ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాత్రి 8:30 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు పార్లమెంటులో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, కీలక అభివృద్ధి అంశాలపై ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.
ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. మీది డేటాతో నడిచే ప్రభుత్వం కాదు.. బేటా నడిపించే ప్రభుత్వమంటూ విమర్శించారు. 18 మాసాలకే ప్రజలు మెచ్చలేదని అర్థమవుతుందా? అని ట్వీట్ చేశారు అంబటి.
వరంగల్ జిల్లా దేవరుప్పులలో కాంగ్రెస్ రెబెల్ సర్పంచి అభ్యర్థి కృష్ణమూర్తి గౌడ్ గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుందర్ పై 879 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఝాన్సీ రెడ్డి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థికి మూడోస్థానం లభించింది. దీంతో గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. ఈ విజయం తన బాధ్యతను పెంచిందని కృష్ణమూర్తి పేర్కొన్నారు.
విజయవాడ శ్రీ లక్ష్మీరామా కోఆపరేటివ్ సొసైటీలో వందల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు వైసీపీ నేత పోతిన మహేష్. 67 మంది ఫౌండర్ మెంబర్లను తొలగించి.. మైనర్లకు సభ్యత్వాలు ఇస్తూ రికార్డులు ట్యాంపర్ చేశారని విమర్శించారు. ఈ ఫోర్జరీ సొసైటీపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మణికొండలో వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను చిత్రపూరి సభ్యులు ఘనంగా సన్మానించారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రామగిరి రాము 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఓటమి భయంతో ప్రత్యర్థులు మూడుసార్లు రీకౌంటింగ్ చేయించినా ఫలితం మారలేదు. తాజాగా అధికార పార్టీ నేతలు నాలుగోసారి రీకౌంటింగ్ కోరడంతో రాము మద్దతుదారులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు సమస్యను పరిష్కరించారు.
సూర్యాపేట జిల్లా కల్మలచెరువులో ఎన్నికల కౌంటింగ్ వేళ హైడ్రామా నడిచింది. నియామక పత్రం అందిస్తామని.. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థిని కౌంటింగ్ రూమ్ నుంచి బయటికి పంపించారు అధికారులు. కాంగ్రెస్ అభ్యర్థిని కౌంటింగ్ రూమ్‌లోనే ఉంచి కాసేపటి తర్వాత రీకౌంటింగ్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
మంచిర్యాల జిల్లా బాపురావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి, రెబల్ అభ్యర్థి వర్గాల మధ్య ఒక్క ఓటు తేడాతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగి పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ పంచాయతీ ఎన్నికలో ఓ ట్రాన్స్ జెండర్ సత్తా చాటింది. చారకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున వార్డు మెంబర్‌గా పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ నందిని బీఆర్ఎస్ అభ్యర్థిపై 64 ఓట్లతో గెలిచింది. తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటానని తెలిపింది ట్రాన్స్‌జెండర్ నందిని.
భద్రాచలంలో మరోసారి గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. బైక్‌పై వెళ్తున్నవారికి.. మరో బైకర్ తగలడంతో వివాదం మొదలైంది. తమ గ్యాంగ్‌ను పిలిపించి దాడి చేశారు యువకులు. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు.
తిరుపతి జిల్లా పీలేరు మోడల్ కాలనీలో స్క్రబ్ టైఫస్ మరణం కలకలం రేపింది. దీనిపై అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు.. వైద్యబృందంతో కలిసి మోడల్ కాలనీని సందర్శించారు. కాలనీలో పరిసరాలను పరిశీలించిన వైద్య బృందం.. మహిళ మృతికి గల కారణాలు సేకరించారు.
బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కొమ్ముతండా గ్రామంలో జరిగింది. పురుగుల మందు తాగి భూక్య వెంకటేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. అవుషాపూర్‌కు చెందిన మంజుల తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లే సరికి ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్‌కు ఈ రైళ్లు వెళ్తాయని చెప్పింది. జనవరి 9 నుంచి 19 మధ్య ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొండిలో ఎస్‌ఐపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో గుంపులుగా ఉన్నవారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులపై దాడి చేసి.. జీపు ధ్వంసం చేశారు. తీవ్ర గాయాలపాలైన ఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పార్లమెంటులో అణుశక్తిపై చర్చ జరుగుతుంటే ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లడంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్. రాహుల్ గాంధీ పర్యటనను తప్పుబడుతున్న బీజేపీ.. ప్రధాని విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. కీలక చర్చలను వదిలి మోదీ ఎందుకు పారిపోతున్నారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకత్వాన్ని వేధించేందుకే నేషనల్ హెరాల్డ్ కేసును ఆయుధంగా వాడుతున్నారని కేసీ వేణుగోపాల్ విమర్శించారు. దర్యాప్తు సంస్థల బెదిరింపులకు పార్టీ భయపడదన్నారు. సత్యం తమ వైపు ఉందని.. దేశవ్యాప్త నిరసనలు పార్టీ ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ట్వీట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ క్రీడల శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పర్యటన సందర్భంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ నిర్ణయం తీసుకున్నారు మంత్రి. ఆయన రాజీనామాను సీఎం మమతా బెనర్జీ ఆమోదించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క నోబు మరణించింది. దీంతో మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వే మా మొదటి పెద్ద బిడ్డవి.. ఎప్పటికీ అలాగే ఉంటావంటూ ఎమోషనల్ అయ్యిరు నమ్రత.
వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 26న ఆరంభం కానుంది. మే 31 వరకు 19వ సీజన్ జరగనుంది. ఐపీఎల్-18లో బెంగళూరు నెగ్గాక చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన నేపథ్యంలో అక్కడ మ్యాచ్లు జరుగుతాయా లేదా అనేది అనుమానంగా మారింది.