E-Paper
Advertisement

Viral News: నా ప్రియురాలితో గడపాలి.. లీవ్ ఇవ్వండి, ఎంప్లాయ్ రిక్వెస్ట్‌ కు మేనేజర్ స్పందన ఇదే!

Viral News: నా ప్రియురాలితో గడపాలి.. లీవ్ ఇవ్వండి, ఎంప్లాయ్ రిక్వెస్ట్‌ కు మేనేజర్ స్పందన ఇదే!
Advertisement

Honest Leave Email: అత్యవసర ప్రయాణాలు, ఆరోగ్యం బాగా లేకపోవడం, ఏదైనా వేడుకలు ఉండటం సహా అత్యవసర సమయాల్లో ఉద్యోగులు లీవ్ కోసం అప్లై చేస్తారు. వాళ్లు చెప్పిన కారణాలు సరైనవే అనిపిస్తే, లీవ్ యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే, ఇవ్వడం కుదరదని చెప్తారు. అయితే, తాజాగా ఓ ఉద్యోగి తనకు ఒక రోజు సెలవు కావాలని తన మేనేజర్ ను కోరాడు. ఇందుకోసం ఆయన చెప్పిన కారణం చూసి ఆశ్చర్యపోయాడు. లీవ్ కోసం పంపిన ఈ మెయిల్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ సెలవు కోసం చెప్పిన కారణం ఏంటంటే?

మేనేజర్ కు పంపిన మెయిల్ లో సదరు ఉద్యోగి డిసెంబర్ 16న ఒక రోజు సెలవు కావాలని రిక్వెస్ట్ చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ మరుసటి రోజు ఉత్తరాఖండ్‌ లోని తన స్వస్థలానికి బయలుదేరాల్సి ఉందని, మళ్లీ తను జనవరిలో తిరిగి వస్తుందని చెప్పాడు. తను వెళ్లడానికి ముందు ఒకరోజు తనతో గడిపేందుకు సెలవు కావాలని ఈ మెయిల్ లో కోరాడు. “హాయ్ సర్, నాకు డిసెంబర్ 16న సెలవు కావాలి. నా గర్ల్ ఫ్రెండ్ 17న ఉత్తరాఖండ్‌లోని తన ఇంటికి బయలుదేరుతోంది. జనవరి వరకు మళ్లీ రాదు. ఆమె వెళ్ళే ముందు రోజు ఆమెతో గడపాలనుకుంటున్నాను. అందుకే, దయచేసి ఒక రోజు సెలవు ఇవ్వాలని కోరుతున్నాను” అని ఇమెయిల్‌ లో రాశాడు.

మేనేజర్ ఏమని రిప్లై ఇచ్చాడంటే?

Advertisement

ఉద్యోగి లీవ్ కోసం చెప్పిన కారణం చూసి మేనేజర్ క్రేజీగా ఫీలయ్యాడు. లీవ్ కోసం తనకు వచ్చే రిక్వెస్ట్ లకు పూర్తి భిన్నంగా ఈ లీవ్ లెటర్ ఉన్నట్లు చెప్పాడు. తాను వారి ప్రేకు అడ్డు పడనని చెప్పిన ఆయన, లీవ్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాడు. “నా ఇన్‌ బాక్స్‌ లోకి ఇటీవల ఈ మెయిల్ వచ్చింది. ఒక దశాబ్దం క్రితం, ఉదయం 9:15 గంటలకు అకస్మాత్తుగా హెల్త్ బాగా లేదు, సెలవు కావాలని మెయిల్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  చాలా మంది నిజాయితీగా తమ కారణాలను చెప్తున్నారు. ఈ వెర్షన్‌ ను కూడా నేను ఇష్టపడుతున్నాను. ప్రేమించడానికి నో చెప్పలేను, కదా? అతడి లీవ్ యాక్సెప్ట్ చేస్తున్నాను” అని మేనేజర్ రాసుకొచ్చాడు.

నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే?

ప్రస్తుతం ఉద్యోగి సెలవు కోసం పెట్టిన ఈమెయిల్, దానికి మేనేజర్ ఇచ్చిన రిప్లైకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగి నిజాయితీని, మేనేజర్ లీవ్ యాక్సెప్ట్ చేసిన విధానాన్ని అభినందిస్తున్నారు. అయితే, కొంత మంది ఈ విధానాన్ని తప్పుబడుతున్నారు. “వ్యక్తిగత కారణాలకు సెలవు మంజూరు చేయడం సరికాదు” అని చెప్తున్నారు. “నాకు వ్యక్తిగత సెలవు అవసరం” అని చెబితే సరిపోతుంది. కానీ, గర్ల్ ఫ్రెండ్ తో గడిపేందుకు సెలవు కావాలని అడగాల్సిన అవసరం లేదు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఎవరైనా కొత్తగా విడుదలైన సిరీస్‌ ను ఒకసారి చూడాలనుకుంటున్నందున సెలవు కావాలి అని అడిగితే? కొత్త ఐఫోన్ లాంచ్ కోసం లైన్‌లో నిలబడటానికి నేను సెలవు తీసుకుంటాను” అంటే అప్పుడు కూడా సెలవు ఇస్తారా?” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ సెలవుపై జోరుగా చర్చ కొనసాగుతోంది.

Advertisement

Read Also:  భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×