E-Paper
Advertisement

Human Interest Story: పెళ్లి కోసం 97 ఏళ్ల వృద్ధుడి పోరాటం.. కొడుకుపై గెలిచి.. ప్రేయసిని దక్కించుకొని..!

Human Interest Story: పెళ్లి  కోసం 97 ఏళ్ల వృద్ధుడి పోరాటం.. కొడుకుపై గెలిచి.. ప్రేయసిని దక్కించుకొని..!
Advertisement

Human Interest Story: ఈ రోజుల్లో 60 ఏళ్లు దాటాయంటే వృద్ధాప్య సంబంధిత రోగాలు చుట్టుముట్టేస్తాయి. షుగర్, బీపీ, కీళ్ల నొప్పులు. నడుం నొప్పి వంటి సమస్యలతో పెద్దవారు బాధపడుతుండటాన్ని రోజూవారి జీవితంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఓ వ్యక్తి 97 ఏళ్ల వయసులో తన ప్రేయసిని దక్కించుకోవడం కోసం అలుపెరగని పోరాటం చేశాడు. గత కొన్నేళ్లుగా  తన రెండవ కుమారుడితో న్యాయపోరాటం చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం ప్రేయసితో అతడి బంధాన్ని కోర్టు సమర్థించింది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తాత ఆనంధానికి అవధులు లేకుండా పోయింది. త్వరలోనే తన ప్రేయసిని రెండో పెళ్లి చేసుకునేందుకు ఆ వృద్ధుడు సిద్ధం కావడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

ఈ వింత కథలోకి వెళ్తే..

97 ఏళ్ల వృద్ధుడి అలుపెరగని పోరాటానికి సంబంధించిన ఘటనను ఓ ఆంగ్ల పత్రిక ఇలా రాసుకొచ్చింది. సింగపూర్ కు చెందిన ఓ రసాయన కంపెనీ యజమాని.. 1950లో వివాహం చేసుకున్నాడు. అతడికి ముగ్గురు కుమారులు జన్మించారు. 1971లో అతడు తన సెక్రటరీతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో శారీరక బంధం ఏర్పరుచుకోవడంతో వారిద్దరికీ ఒక బిడ్డ జన్మించాడు. అయితే సెక్రటరీతో భర్తకు ఉన్న సంబంధం గురించి.. భార్యకు ముందే తెలిసినప్పటికీ దీనిని ప్రశ్నించకుండా ఆమె మౌనం వహిస్తూ వచ్చింది. 2014లో భార్య చనిపోవడంతో.. తాను ప్రేమించిన సెక్రటరీని ఆ వ్యక్తి నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు.

కోర్టుకెళ్లిన రెండో కుమారుడు..

Advertisement

అయితే భార్య హోదాను కల్పిస్తూ మరో స్త్రీని ఇంటికి తీసుకురావడాన్ని వృద్ధుడి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. ఆ వివాదం కొన్నేళ్ల పాటు సాగి.. 2021కి వచ్చేసరికి తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో తన ప్రేయసిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ వృద్ధుడు ప్రకటించాడు. దీంతో తండ్రి నిర్ణయాన్ని తప్పుబడుతూ రెండో కుమారుడు.. ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 2017లో ఓ పరాభవం ఫలితంగా తన తండ్రి మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లు కోర్టుకు తెలియజేశాడు. కాబట్టి తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని పిటిషన్ లో డిమాండ్ చేశాడు. అదే సమయంలో తన తండ్రి మానసిక పరిస్థితి అవకాశం చేసుకొని అతడి ప్రేయసి ఆస్తిని కాజేసినట్లు కూడా కుమారుడు ఆరోపించాడు.

వీలునామాలో కొడుకు పేరు తొలగింపు..

రెండో కుమారుడు తన పెళ్లికి వ్యతిరేకంగా ఫ్యామిలీ కోర్టుకు వెళ్లడంతో ప్రేయసిపై నిందలు వేయడంతో వృద్ధుడి కోపం తారాస్థాయికి చేరింది. గతంలో తన ఆస్తులకు సంబంధించి రాసిన వీలునామాలో రెండు కుమారుడు, అతడి సంతానం పేరును తొలగించాడు. తన మనవడ్ని ఇంటి నుంచి బయటకు సైతం గెంటేశాడు. మరోవైపు వృద్ధుడి మానసిక పరిస్థితిపై వైద్య పరీక్షలకు ఆదేశించిన న్యాయస్థానం.. వృద్ధుడి మెంటల్ కండీషన్ బాగానే ఉన్నట్లు తేల్చింది. వివాహం, ఆస్తికి సంబంధించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థితిలోనే అతడు ఉన్నట్లు నిర్ధారించింది.

Advertisement

Also Read: Medaram Jatara 2026: మేడారం భక్తుల వింత కోరికలు.. నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి భయ్యా!

పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు..

2017 నుంచి ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతున్న రెండో కుమారుడు.. 2019లో తన తండ్రిని కంపెనీ సీఈఓగా ఉండేందుకు ఎలా మద్దతు ఇచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు తన తండ్రి ప్రేమిస్తున్న యువతి ఆస్తి కాజేసిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవని సింగపూర్ కోర్టు పేర్కొంది. మెుదటి భార్య గతంలోనే మరణించినందున తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ నిర్ణయమైన తీసుకునే హక్కు ఆ వృద్ధుడికి ఉందని తేల్చి చెప్పింది. దీంతో 97 ఏళ్ల వయసులో ఆ వృద్ధుడు.. తన ప్రేయసిని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సదరు అంతర్జాతీయ మీడియా కథనం చెప్పుకొచ్చింది.

Also Read: Epstein Files: స్వీడిష్ అందగత్తెతో అనిల్ అంబానీ? ఎప్‌స్టిన్ ఫైల్స్‌లో సంచలనం.. ఇది నిజమేనా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×