BigTV English

Viral videos : రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత జరిగింది చూస్తే..!

Viral videos : రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత జరిగింది చూస్తే..!

Tiger videos


Tiger Viral videos : మనం అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు రకరకాల జంతువులు కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో మన ముందుకు ఏదైనా జంతువు ఒక్కసారిగా వస్తే అక్కడే ఆగిపోతాం. లేదా స్పీడ్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాం. ఇలానే మహారాష్ట్రలోని గోండియా జిల్లా నవేగావ్-నాగ్జిరా కారిడార్‌లో ఓ పులిని కారు ఢీకొనడంతో పులి మరణించింది.

కారు ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పులిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు అటవీ అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో కొహ్మారా-గోండియా రోడ్డులోని ముర్దోలి అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా దాదాపు రెండేళ్ల వయసున్న ఈ పులిని కారు ఢీకొట్టిందని డీసీఎఫ్ గోండియా డివిజన్ ప్రమోద్ పంచ్‌భాయ్ తెలిపారు.


Read More : కొండచిలువ మెడలో వేసుకున్న తాగుబోతు.. చివరకు బిగ్ ట్విస్ట్..!

ఘటన రాత్రి సమయంలో జరగింది. చనిపోయిన పులి ఎమ్ఎన్‌టీఆర్‌లోని టీ-14 వంశానికి చెందినదిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అది మగ పులి అని తెలిపారు. గోండియా డివిజన్‌లోని గోరెగావ్ పరిధిలోని పులి కారు ఢీకొట్టింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కారం.. గోరేవాడలోని వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సెంటర్‌లో పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. సమగ్ర విచారణ జరిపి పులి మరణానికి కారణమైన వారిని శిక్షిస్తామని అధికారులు వెల్లడించారు.

అయితే పులిని కారు ఢీకొట్టిన అనంతరం ఆగింది. ఆ తర్వాత ఆ కారు వెనకాలే ఉన్న మరో కారులో ఉన్నవారు.. గాయపడిన పులి అడవిలోకి వెళ్లడాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో గాయపడిన కాసేపు రోడ్డుపైనే కూలబడిపోయింది. శరీరం సహకరించపోయినా కాళ్లను ఈడ్చుకుంటూ అడవిలోకి వెళ్లింది. సమచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అడవిలోని పులిని వెతికి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసేలోపు పులి చనిపోయింది.

Read More :  డాక్టర్లకు సవాల్, పుట్టిన ఐదురోజుల బేబికి పీరియడ్స్

కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనరగం జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగింది. జిల్లాలోని రామభద్రాపురం మండలం తారాపుత్రం వద్ద రోడ్డును దాటుతున్న పులిపిల్లను అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో ఆ పులిపిల్ల అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు పులిపిల్ల కళేబరాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన పులిపిల్ల వయస్సు 2 సంవత్సరాలు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.

మన దేశంలో పులులను రక్షించే చట్టాలు..

  • జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960
  • జంతువులను కొట్టడం, తన్నడం, అధిక బరువు వాటిపై వేయడం నేరం.
  • జంతువులకు హానికరమైన మందులు ఇవ్వకూడదు.
  • నొప్పి లేదా బాధ కలిగించే భంగిమలో జంతువులను ఉంచకూడదు.
  • జంతువులను వాటికి తగినంత స్థలంలో ఉంచాలి.
  • ఎక్కువ కాలం పాటు జంతువలను బంధించకూడదు.

ఇండియన్ పీనల్ కోడ్ 1860..

సెక్షన్ 428

విలువ చేసే ఏదైనా జంతువును చంపడం, విషప్రయోగం చేయడం, అంగవైకల్యం చేయడం లేదా దుష్ప్రవర్తనకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది.

Related News

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Big Stories

×