BigTV English
Advertisement

MS Dhoni Dandiya : ధోనీ దాండియా ఆడితే ఆ కిక్కే వేరప్ప..!

MS Dhoni Dandiya : ధోనీ దాండియా ఆడితే ఆ కిక్కే వేరప్ప..!

MS Dhoni Dandiya


MS Dhoni Dandiya At Anant Ambani-Radhika Pre Wedding : రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుగుతున్న ఈ గ్రాండ్ ఈ వెంట్‌లో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపార దిగ్గాజలు, సెలబ్రెటీలు, స్పోర్ట్స్ పర్సన్స్ పాల్గొంటున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఈవెంట్ కోసం బాలీవుడ్ మాత్రమే కాదు.. క్రికెట్‌లోని మెరిసే తారలు కూడా జామ్‌నగర్ చేరుకున్నారు. టీమ్ ఇండియా క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్యతో కలిసి హాజరయ్యారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా తన భార్య సాక్షితో కలిసి అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు చేరుకున్నాడు.


Read More : అంబానీ దంపతుల డ్యాన్స్ అదుర్స్‌, వైరల్ అవుతున్న వీడియో

అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో మహేంద్ర సింగ్ ధోని తన పాత చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడు బ్రావోతో కలిసి దాండియా ఆడాడు. ఈ సమయంలో ధోని భార్య కూడా ఉన్నారు. ధోనీ, బ్రావోల దాండియా చూడదగ్గ దృశ్యంగా నిలిచిపోయింది. వీరిద్దరి డ్యాన్స్‌ను అక్కడ ఉన్నవారు, నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ధోనీ ఫాన్స్‌ను ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ధోనీ, సాక్షి క్రీమ్ కలర్ దుస్తులతో వచ్చారు. ఇదిలా ఉంటే బ్రావో బ్లేజర్ లుక్‌లో కనిపించాడు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడో రోజు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. మార్చి 1న ప్రారంభమైన అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడో రోజుకు చేరుకున్నాయి.

salman khan

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్,షారుక్,అమీర్ ఖాన్ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు. అలానే.. సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖ బాలీవుడ్ హీరోలతో ధోనీ సంభాషించారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా ధోని ఇంటరాక్ట్ అయ్యారు.

Tags

Related News

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Big Stories

×