E-Paper
Advertisement

Snake Inside of Man Shirt: ఓరి దేవుడో.. చోటు లేనట్టు వ్యక్తి చొక్కాలో దూరిన పాము.. చివరకు దారుణంగా.. వైరల్ వీడియో!

Snake Inside of Man Shirt: ఓరి దేవుడో.. చోటు లేనట్టు వ్యక్తి చొక్కాలో దూరిన పాము.. చివరకు దారుణంగా.. వైరల్ వీడియో!
Advertisement

Snake Inside of Man Shirt: వర్షాకాలంలో జంతువులు తరచూ బయటకు వస్తాయి. వరదల కారణంగా పాములు కచ్చితంగా భూమి నుంచి బయటకు రావాలి. ప్రస్తుతం ఓ వ్యక్తి చొక్కాలోకి పాము ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాము కూడా చాలా విషపూరితమైనది. కాబట్టి చిన్న పొరపాటు జరిగిన ఆ వ్యక్తి ప్రాణాలు పోయేవి. అసలు ఏం జరిగింది? పాము చొక్కా ఎలా దూరింది? తదితర వివరాలు తెలుసుకుందాం.

ఆ వ్యక్తి చొక్కాలోకి ప్రమాదకరమైన నాగుపాము ప్రవేశించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి పొలంలో కూర్చున్నట్లుగా ఉంటుంది. అంతే కాకుండా అతని చొక్కాలో పాము ఉన్నట్లు కనిపిస్తుంది. చొక్కా లోపల నుండి పాము బుసలు కొడుతూ చూడటానికి భయంకరంగా ఉంటుంది. అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు ఆ వ్యక్తిని కదలవద్దని సలహా ఇస్తున్నారు. కానీ ఆ సమయంలో వ్యక్తి తన చొక్కా బటన్లను తెరవడానికి ప్రయత్నిస్తాడు.

Advertisement

అయినప్పటికీ పాము చొక్కా లోపల కదులుతూనే ఉంటుంది. దీని కారణంగా వ్యక్తి బాగా భయంతో వణికిపోతుండాడు. కొంత సమయం తరువాత పాము చొక్కా నుండి వెనుకకు వెళ్లి పోతుంది. అనంతరం వెనుక నుంచి బయటకు వచ్చింది. కానీ పాము నోరు చొక్కా లోపల ఉండిపోతుంది. తర్వాత చిన్నా చొక్కా ఎత్తగానే బయటకు వచ్చిన పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Also Read: Viral Video: ఒంటెను ఢీకొన్న కారు.. పాపం ఎటూ కదల్లేని పరిస్థితిలో ?

Advertisement

ఆ వ్యక్తి చొక్కాలోకి ప్రవేశించిన పాము చాలా విషపూరితంగా ఉంటుంది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ పొలాల్లో పని చేసి భోజనం అనంతరం చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పాడు. ఈ సమయంలో తన చొక్కాలోకి పాము ఎప్పుడు ప్రవేశించిందో కూడా అతనికి తెలియదని అన్నారు. అయితే పాము బయటకు వచ్చేంత వరకు ఆ వ్యక్తి ప్రశాంతంగా కూర్చున్న తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వీడియో ఎక్కడ నుండి, ఎప్పుడు అనేదానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.

Also Read: చనిపోయాడనుకుని కుంటలోంచి బయటకు తీస్తుండగా లేచి నిలబడ్డాడు!

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నీ ధైర్యానికి హాట్సాఫ్ అని అంటున్నారు. నాకైతే గుండెపోటు వచ్చేదని మరో యూజర్ ఒకరు రాశారు. అతను ఎలా బతికే ఉన్నాడో అర్థం కావడం లేదని, నేను అక్కడ ఉండి ఉంటే గుండెపోటుతో చనిపోయేవాడినని మరొకరు తెలిపారు. బహుశా ఈ పాము శాకాహారి అని, లేదంటే 15-20 సార్లు కాటు వేసి ఉంటుందని అంటున్నారు. ఈ వ్యక్తి ఎలాంటి తొందరపాటు చూపకుండా ప్రాణం కాపాడుకున్నాడని అన్నారు.

Tags

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×