BigTV English

Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు..

Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు..

Police file Charge Sheet on Telangana Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వ పాలకులు అధికార దుర్వినియోగం చేశారు. కీలకమైన ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత సమాచారాన్ని, రాజకీయ సమాచారాన్ని సేకరించి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.


అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురు బడా పోలీసు బాస్‌లను అరెస్ట్ చేశారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అటు ఈ కేసులో పోలీసులు ఆరుగురిని నిందితుల జాబితాలో చేర్చారు.


Also Read: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు.. అంతా మాజీ సీఎం స్కెచ్చే..!

ఈ కేసులోని నిందితులు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ల సందర్భంగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. వీరి బెయిల్ పిటిషన్ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కీలక వాదనలు చేశారు. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ కూడా.. ఇంకా విచారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని.. కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దని పీపీ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పను బుధవారానికి రిజర్వ్ చేసింది.

Tags

Related News

Formula-E Race Case: ఫార్ములా రేస్ కేసు.. గవర్నర్‌కు నివేదిక, అనుమతి తర్వాత కేటీఆర్‌ అరెస్ట్?

Telangana politics: క్లారిటీ ఇచ్చిన లోకేష్.. ఔను ఇద్దరం కలిశాం, కవిత టీడీపీలోకి వస్తే

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక

Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!

Warangal Incident: ‘నా భార్యతో ప్రాణహాని ఉంది’.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త

Heavy Rains: రాష్ట్రంలో ఒకవైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు భారీ వర్షాలు

×