Big Stories

Odisha New CM: ఒడిశా కొత్త సీఎంగా మోహన్ చరణ్ మాఝీ.. ముఖ్యమంత్రి ప్రస్థానమిదే!

Mohan Charan Majhi as Odisha’s New Chief Minister: ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బాధ్యతలు చేపట్టనున్నట్టు బీజేపీ సీనియర్ నేత, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం ప్రకటించారు. నక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిదా ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపడతారని సింగ్ తెలిపారు.

- Advertisement -

52 ఏళ్ల మాఝీ ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో మాఝీ కియోంజర్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా మాఝీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

- Advertisement -

బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల పదవీకాలం ఇటీవలి జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారీ ఓటమితో ముగియడంతో ఒడిశాలొ బీజీపీ నాయకుడు మోహన్ మాఝీ మొదటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఒడిశాలో మొదటి బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకార కార్యక్రమం జూన్ 12న జరగాల్సి ఉంది. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి బీజేడీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కూడా బీజేపీ ఆహ్వానించింది.

Also Read: Mohan Charan Majhi Oath: ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం.. హాజరైన మాజీ ముఖ్యమంత్రి..

మోహన్ చరణ్ మాఝీ ఎవరు..?
గిరిజన సంఘంలో ప్రముఖ సభ్యుడైన మోహన్ చరణ్ మాఝీ 2000 సంవత్సరంలో కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒడిశా శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. అతను 2000 నుంచి 2009 సంవత్సరాలలో కియోంజర్‌కు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తరువాత మాఝీ 2019లో కియోంజర్ నుంచి మరోసారి ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో, మాఝీ తన అంకితమైన ప్రజా సేవ, అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాలకు ఖ్యాతి గాంచారు. తన నియోజకవర్గాల పట్ల ఆయనకున్న నిబద్ధత, సమర్థవంతమైన నాయకత్వం ఆయనను ఒడిశా రాజకీయ దృశ్యంలో గౌరవనీయ వ్యక్తిగా మార్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News