Richest Dog: సాధారణంగా ఓ మనిషికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు. ఎంతో కష్టపడి సంపాదించి ఆస్తులు, భూములు వంటివి కూడబెట్టుకుంటాడు. ఇలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఎంతో మందికి కోట్లు సంపాదించి కోటీశ్వరులుగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ రాజాలాగా బ్రతకాలని అనుకుంటారు. అయితే మనుషుల్లోనే కొంత మందికి సాధ్యం కానిది ఓ కుక్కకు సాధ్యం అయింది. అవునండీ, ఓ కుక్క ఏకంగా కోట్ల ఆస్తులను అనుభవిస్తుంది. వింటే ఆశ్చర్యం అనిపించినా కూడా ఇదే నిజం.
ఓ కుక్క వేల కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ డాగ్ గా గిన్నిస్ రికార్డు కూడా కైవసం చేసుకుంది. అంతేకాదండోయ్ ఈ కుక్కకు కేవలం ఆస్తులు మాత్రమే కాదు ఎంతో డబ్బు, కార్లు, విమానంలో ప్రయాణం చేస్తూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తుంది.
దీనికి ఏకంగా బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. సాధారణంగా ఇది ఒక మనిషికి కూడా ఉండడం అంటేనే ఎంతో ఆస్తులు కలిగి ఉండాలి. అలాంటిది ఓ కుక్క ఏకంగా కోట్ల ఆస్తులతో పాటు బీఎండబ్ల్యూ కారును కూడా కలిగి ఉంది. అంతేకాదు దీనికి సేవలు చేసేందుకు ఏకంగా 27 మంది సిబ్బంది కూడా ఉన్నారు. దీనికి సేవలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపేందుకు సహాయం చేస్తున్నారు.
ఈ కుక్క జర్మన్ షెఫర్డ్ జాతికి చెందింది. దీని పేరు గుంథెర్ 6. ఈ కుక్కకు ఏకంగా రూ. 3,300 కోట్ల ఆస్తులు కూడా కలిగి ఉంది. అంతేకాదు ఇది తినడానికి ఎన్నో రకాల రుచికరమైన ఆహార పదార్థాలు కూడా సర్వ్ చేస్తుంటారు. దీనికి ఆహారం వండేందుకు ఓ సెపరేట్ షెఫ్ కూడా ఉన్నాడు. అయితే కర్లోటా లీబెన్ స్టీన్ అనే వ్యక్తి దీనిని పెంచుకుంటున్నాడు. తన కుమారుడు 1992లో చనిపోవడంతో తన ఆస్తిని గుంథెర్ 3 పేరు మీద రాశారు. దీని బాధ్యతలను తన స్నేహితులకు అప్పగించాడు.
View this post on Instagram