BigTV English

Unconditional Love of a Father: స్టేజ్ పై కొడుకు యాక్టింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి! వీడియో వైరల్

Unconditional Love of a Father: స్టేజ్ పై కొడుకు యాక్టింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి! వీడియో వైరల్

viral video


Unconditional Love Of a Father: పిల్లలు మంచి స్థాయికి వెళ్లాలని ప్రతి తల్లిదండ్రి కళ. జీవిత ఆసయం కూడా. అందులో ముఖ్యంగా తండ్రి తన కొడుకు ఫైలెట్ అవుతాడని, ఇంజనీర్, సింగర్ లేదా ఇతర రంగాల్లో రాణించాలని చిన్నప్పటి నుంచే కళలు కంటుంటాడు. వారి సాధించిన విజయాలను తను సాధించినట్లుగా భావిస్తాడు తండ్రి. పిల్లలు ప్రయోజకులు అయితే తండ్రి కళ్లలో కలిగే ఆనందమే వేరు. జీవితం ఇక చాలు అనుకుంటాడు. తన కుమారుడి విజయాన్ని ప్రపంచమంతా తెలిసేలా సెలబ్రేట్ చేసుకుంటాడు. కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు.

ప్రస్తుతం అలాంటి ఎమోషనల్ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. ఇందులో కుమారుడు స్టేజీపై ప్రదర్శన ఇస్తుంటే.. కింద జనాల్లో ఉన్న తండ్రి కొడుకు నటన చూసి చిన్న పిల్లాడిలా కండతడి పెట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతానికి సోషల్‌లో ట్రెండ్ అవుతోంది.


Also Read: రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలుకే.. ఈ ఆఫర్ ఎక్కడ అని చూస్తున్న మనోళ్ళు!

వీడియో చూస్తే.. స్టేజీపై ఓ కుర్రాడు ప్రదర్శన ఇస్తుంటాడు. అయితే అక్కడి ఆడియెన్స్ మధ్యలో నిలబడి ఉన్న అతడి తండ్రి తన కొడుకు నటన చూసి ఎమోషనల్ అవుతాడు. కొడుకు యాక్టింగ్‌కు పట్టరాని సంతోషంతో చప్పట్లు కొడుతూ.. కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ ఫాదర్ ఎమోషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియో అక్కడే ప్రేక్షకుల్లో ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. @ShoneeKapoor అనే ఖాతాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అన్ కండీషనల్ లవ్ ఆఫ్ ఫాదర్ అనే కొటేషన్ ఇచ్చాడు. ఆ తండ్రి కంటతడి పెట్టుకుంటుంటే పక్క నుంచి ఎవరో ఓదార్చుతున్నారు. కానీ అతడెవరో పూర్తిగా తెలియలేదు. వీడియోలో అతడి ముఖం కూడా సరిగా కనిపించలేదు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 391.9K మంది వీక్షించారు. 12 వేల మందికి పైగా లైక్ చేశారు. 1.1K రీ పోస్ట్ చేశారు. మా నాన్న గుర్తుచ్చొడని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరోకరు ఆ తండ్రి ప్రపంచాన్ని జయించినట్లు ఫీలవుతున్నాడని కామెంట్ చేశారు.

Also Read: కుక్కతో కోడిపుంజు బాక్సింగ్.. నెట్టింట నవ్వులే నవ్వులు!

తల్లిదండ్రులు పిల్లలపై ఎంత ప్రేమ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రేమకు ఏది కూడా సాటిరాదు. పిల్లలపై వారి ప్రాణాలనే పెట్టుకుంటారు. వారికి ఏదైనా చిన్న గాయమైన.. వీరి కంట్లో నీళ్లు తిరుగుతాయి. పిల్లలకు తమ ప్రాణాలను అర్పించిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వారు పెరిగి పెద్దయ్యే వరకు వారి కోసమే బ్రతుకుతారు. ప్రేమకు నిదర్శనమే పేరెంట్స్. వీరి ప్రేమకు మంచింది ప్రపంచంలో ఏది లేదు.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×