BigTV English

Dog Vs Cock: ముక్కు నెలకు రాస్తూ కోడిపుంజు రంకెలు.. పట్టనట్టు పడుకున్న కుక్క.. ఫన్నీ వీడియో

Dog Vs Cock: ముక్కు నెలకు రాస్తూ కోడిపుంజు రంకెలు.. పట్టనట్టు పడుకున్న కుక్క.. ఫన్నీ వీడియో
Dog Makes Lovely Friendship

Cock trying to fighting with Dog: మనం సాధారణంగా కుక్కలను చూసి వణికిపోతాం. ఎందుకంటే అవి కరిస్తే బొడ్డు చుట్టూత ఇంజక్షన్లు చేయించుకోవాలి. కుక్కు ఓ పీకు.. పీకిందంటే ప్రాణాలు కూడా పోతాయి. అయితే కుక్కలు చాలా విశ్వాసం కలిగి ఉంటాయి. అందుకే వీటిని చాలామంది ఇళ్లలో పెంచుకుంటారు. మన ఆర్మీకి కూడా కుక్కుల సేవలు అందిస్తున్నాయి. కుక్కులను ఉన్న వాల్యూ అటువంటిది మరీ..!


కుక్కలతో స్నేహం చేస్తే అవి చాలా విశ్వాసంగా ఉంటాయి. కుక్కుల మనకు చాలా విధాలుగా సహాయం చేస్తాయి. ఇటివలే ఓ యజమాని చనిపోతే కుక్క ఏడుస్తూ ఆ శవం దగ్గరే పడిగాపులు కాసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో అప్పుడు తెగ వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు ఎందరో కన్నీరు పెట్టుకున్నారు.

ఇదంతా పక్కనబెడితే.. కుక్కల కంట ఏదైనా కోడి పడితే ఏం చేస్తుందో మీకు తెలుసుగా ?. దాన్ని పరిగెత్తించి, వేటాడి ఆమాంతం తినేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని కుక్కలు అలా చేయవు. కోళ్లతో ఫ్రెండ్ షిప్ చేస్తాయి. వాటితో ఆటలు కూడా ఆడుతాయి. తాజాగా ఇటువంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: ఓరేయ్.. ఇదేం ప్రేమరా బాబు.. వైరల్ వీడియో!

జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. అయితే జంతువులకు ఏ ఫీలింగ్స్ ఉండవు అనుకుంటాము గానీ, వాటికి కూడా మనుషుల్లా ఏమోషన్స్ ఉంటాయి. అవి కూడా కోపాన్ని, జాలిని ప్రదర్శిస్తాయి. అలానే కోడి పందాలు చూసి ఉంటాం. కుక్కుల ఫైటింగ్ చేసుకోవడం చూసే ఉంటాం. కానీ ఓ కుక్కు, కోడిపుంజు ఫైటింగ్ ఎప్పుడైనా చూశారా?

ఈ వీడియో చూసిన్లయితే కుక్కు మందు ఫోజులు ఓ కోడిపుంజు కుక్క మీదకే కాలు దువ్వుతుంది. కుక్క మాత్రం దాని వేశాలు చూస్తూ సరదాగా ఎక్సర్‌సైజ్ చేస్తుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరులోని ఎన్‌ఎస్‌పీ క్రాస్ రోడ్డు వద్ద జరిగింది.

అసలు మ్యాటర్‌లోకి వెళితే.. కల్లూరులోని ఒక ఇంటి యజమాని తన ఇంట్లో కోడి పుంజు పెంచుకుంటున్నాడు. రోజూ ఓ కుక్కపిల్ల ఇంటికి వస్తుంటే అన్నం పెడుతూ చేరదీశాడు. దాన్ని కూడా సాకుతున్నాడు. మరో విషయం ఏమిటంటే కోడిపుంజు తెల్లగా ఉందని వైట్ అని పేరు పెట్టాడు. కుక్కనేమో రాజు అని పిలిచేవాడు. ఇవి రెండూ కూడా ఒకే చోట చిన్నప్పటి నుంచి పెరిగాయి. దీంతో కుక్క, కోడిపుంజు మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

Also Read: రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలుకే..!

రాజు.. పగలంతా కోడిపుంజుపై ఇతర జంతువులు దాడిచేయకుండా భద్రంగా కాపేడేవాడు. వైట్ మాత్రం రాత్రిళ్లు దర్జాగా నిద్రపోయి.. తెల్లవారగానే కుక్కను నిద్రలేపేది. కల్లూరులో రాజు, వైట్ తెలియని వారుండరు. ఇద్దరు చాలా ఫేమస్. ఇవి రెండూ పగలు కలసి మెలసి తిరుగుతూ ఉండేవి. స్నేహం అంటే ఇలా ఉండాలని స్థానికులు కూడా చెప్పుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇవి ఫైటింగ్ చేసుకుంటాయట. ఈ ఫైటింగ్ చూడటానికి చాలా సరదాగా ఉంటుందని స్థానికులు తెలిపారు.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×