BigTV English

Couple Moving Car Romance: పిచ్చికి పరాకాష్ట అంటే ఇదేనేమో! రన్నింగ్ కారు.. పైగా డోర్ భయట అమ్మాయితో రోమాన్స్

Couple Moving Car Romance: పిచ్చికి పరాకాష్ట అంటే ఇదేనేమో! రన్నింగ్ కారు.. పైగా డోర్ భయట అమ్మాయితో రోమాన్స్
Viral Videos
Couple Romance

Couple Moving Car Romance: ప్రేమ అనేది ప్రపంచంలోనే ఎంతో గొప్పది. నేటి కాలంలో యువత ఈ ప్రేమ కోసం పరితపించిపోతుంటారు. అనుక్షణం తమ పాట్నర్ గురించి ఆలోచిస్తూ, టైమ్ స్పెండ్ చేస్తూ.. రోజును ఇట్టే గపిపేస్తుంటారు ప్రేమికులు. అయితే ప్రేమలో ఉన్నవారికి ప్రతిరోజూ పండగే. పాట్నర్‌కు వారి ప్రేమను ప్రతిరోజూ కొత్తగా తెలియజేస్తుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.


ఈ మధ్యకాలంలో లవ్‌ను తమకు ఇష్టమైన వారికి చూపించడానికి కొంచెం అడ్వాన్స్ అయ్యారు ప్రేమికులు. బైకులపై కటెషన్లు రాయడం, కారుపై ప్రపోజ్ చేస్తూ పెయింట్ చేయడం, ఎత్తైన బిల్డింగ్‌పై నుంచి లవ్ షేప్‌లో బెలూన్స్ ఎగరవేయడం, లాంగ్ డ్రైవ్‌కి వెల్లి ప్రపోజ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇక రింగులు, గిఫ్ట్స్ ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తుంది. ఇటువంటి ఘటనలు బోలెడు చూసుంటాం. సోషల్ మీడియాలో కూడా ఇటువంటి వీడియోలు వైరల్ అవుతుంటాయి.

అయితే తాజాగా ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఘటనల కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఒక్కసారి వీడియో చూడండి.


Also Read: రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలుకే..!

వీడియోలో కనిపించే ఫార్చ్యూనర్ కారు డ్రైవర్ దగ్గర ఓ అమ్మాయి వేళాడుతూ కనిపించింది. కారుకు ఉండే బంపర్ సపోర్ట్‌పై నుంచుని ఉంది. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆమెను పట్టుకొని ఉన్నాడు. ఇద్దరు ఏం చేస్తున్నారో స్పష్టంగా తెలియడం లేదు. కారు నడుపుతున్న వ్యక్తికి ఏదో కబుర్లు చెబుతున్నట్లుగా మాత్రం అర్థం అవుతుంది. ఈ సంఘటన మొత్తాన్ని వెనకున్న వేరే కారు నుంచి షూట్ చేశారు. అనంతరం దాన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశారు.

ఈ ఘటన లక్నోలోని ఫీనిక్స్ ప్లాసియో సమీపంలో జరిగింది. కదులుతున్న కారుకు ఓ అమ్మాయి వేలాడుతూ చేతులు పట్టుకుని కబుర్లు చెప్పుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు పోలీసులు గట్టి గుణపాఠం చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: ఒక్క నిమ్మకాయ ధర రూ. 35వేలు.. స్పెషల్ ఏంటంటే!

ప్రస్తుత కాలంలో సినిమా చూడాలంటే సినిమా థియేటర్‌‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలా రోడ్డుపై బోలెడు సినిమాలు టికెట్ తీసుకోకుండా ఫ్రీగా చూడొచ్చని రాసుకొచ్చాడు ఓ యూజర్. మొన్నటి వరకు బైక్‌పై జరిగిన లవ్ ప్రపోజల్స్.. ఇప్పుడు ఇలా కారు బటయ వేళాడే వరకు వచ్చాయని కామెంట్ చేశాడు.

మరికొందరు రీల్స్ పిచ్చి పీక్స్‌కు చేరిందని అంటున్నారు. వారు నడిరోడ్డుపై సరసాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఈ రోజుల్లో పోలీసులకు ఎవరూ కూడా భయపడటం లేదని చెబుతున్నారు. ఇక వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. జంటను గుర్తించి కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. పోలీసులు తీసుకున్న చర్యల పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Viral Video: ఆహా.. తందూరి రోటీలో బల్లి.. దోరగా వేగిపోయి.. కస్టమర్‌కు షాక్!

Viral Video: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!

Viral video: తాళి కడతావా లేదా? కట్టకుంటే వి*ప్పేస్తా.. అమ్మాయి వార్నింగ్.. వీడియో వైరల్!

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Bizarre Food: రసం రైస్.. ఐస్‌ఫ్రూట్, తినక్కర్లేదు.. ఏకంగా నాకేయొచ్చు!

Big Stories

×