E-Paper
Advertisement

Kuwait Viral Video: కువైట్‌లో నరకం చూస్తున్న వ్యక్తి,కాపాడాలంటూ విజ్ఞప్తి..

Kuwait Viral Video: కువైట్‌లో నరకం చూస్తున్న వ్యక్తి,కాపాడాలంటూ విజ్ఞప్తి..
Advertisement

A Man Who Is Witnessing Hell In Kuwait Pleads For Protection: మనదేశంలో అయితే ఉపాధికి తగ్గ జీతం దొరకక బయటి దేశాలకు బ్రతకుదెరువు కోసం వలస వెళ్తుంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఈ క్రమంలో కొంతమంది మీడియోటర్లతో అవస్థలు పడుతూ ఉంటారు.మరికొందరు వారి జాబ్ ఒకటి అయితే అక్కడ చేసే జాబ్ మరొకటి ఇస్తారు.దీంతో ఇక్కడి నుండి పోయినవాళ్లంతా నానా నరకయాతనలు పడుతుంటారు. ఇక ఎడారి నగరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఎడారి దేశమైన సౌదీ అరేబియా దేశంలో మన తెలుగురాష్ట్రాలకు చెందిన చాలామంది అమాయకులు నానా అవస్థలు పడుతున్న సంఘటనలు మనం చాలానే చూశాం. చూస్తున్నాం.

ఒకప్పుడు అంటే ఇంటర్నెట్‌ వ్యవస్థ లేదు కాబట్టి వారి బాధలు ఎవరికి వినిపించేవి కావు. ఇప్పుడు అలా కాదు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. 5జీ నెట్‌వర్క్‌తో క్షణాల్లో వీడియోలు వాట్సాప్ రూపంలో తమ బాధలను వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా ఎడారి నగరంలో నీళ్లు, తిండి లేక తమ బాధలను ఎవరికి చెప్పాలో తెలియక, చెబితే ఎమౌతుందోనని భయపడుతూ అక్కడే నానా బాధలు పడుతూ బతుకుని ఎల్లదీస్తుంటారు. తాజాగా మరో వ్యక్తి తన బాధను వ్యక్తపరుస్తూ ఓ వీడియోని తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Also Read: రైల్వే ట్రాక్‌పై చేపల జలకాలాట,వీడియో నెట్టింట వైరల్‌

ఈ వీడియోలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తపరుస్తూ అక్కడున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తెలిపాడు.అంతేకాకుండా అక్కడ కనీసం సేద తీరడానికి చెట్లు, తినడానికి తిండి,తాగాడానికి నీరు కూడా లేదని తన ఆవేదనని వ్యక్తం చేశాడు. బ్రతుకంతా ఈ కుక్కలు, పిల్లులు, బాతులకు ఆహారం పెట్టడమే నా పని అంటూ తన ఆవేదనని వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. కనీసం ఈ అడవి చుట్టూ ఎవరు కూడా కనిపించరు. కనీసం మాట్లాడుకోవడానికి పక్కన ఒక్క వ్యక్తి కూడా కనిపించడని ఎమోషనల్ అయ్యాడు. తనని ఈ దేశానికి తీసుకొచ్చిన ఏజెంట్‌కి పలుమార్లు ఫోన్ చేసిన స్పందించడం లేదని, అంతేకాకుండా తన భార్య సైతం తన బాధని పట్టించుకోవడం లేదని తన బాధను వీడియోలో పంచుకున్నాడు.

Advertisement

ఇలా రోజు చస్తూ బ్రతకడం నా వల్ల కాదని తన బాధని అర్ధం చేసుకొని ఈ బాధల నుండి విముక్తి చేయాలని వేడుకుంటున్నాడు. ఇంకా ఇలాగే కొనసాగితే నా బ్రతుకు ఎడారి ఇసుకలోనే గడిచిపోతుందని.. ఇంకా రోజులు చూస్తా.. ఎవరు పట్టించుకోకపోతే ఇక్కడే సూసైడ్ చేసుకొని చనిపోతానంటూ తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు కట్టుకున్న భార్య సైతం తన దగ్గర డబ్బులు లేవని ఏజెంట్‌కి డబ్బులు కట్టమని వేదిస్తూ తనని పట్టించుకోవడం లేదంటూ వాపోయాడు. అంతేకాదు ఎవరైనా నన్ను కాపాడి తన ప్రాణం పోకుండా చూడాలంటూ వేడుకుంటున్నాడు. ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఎవరైనా పెద్ద మనసు చేసుకొని ఈ వ్యక్తిని కాపాడాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×