E-Paper
Advertisement

James Anderson : టెస్టు క్రికెట్‌లో అరుదైన బౌలర్ జేమ్స్ ఆండర్సన్.. అతని పేరున్న రికార్డ్స్ ఇవే..

James Anderson| ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ లో సుదీర్ఘ కాలం ఆడిన ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్. లార్డ్స్ మైదానంలో ఇటీవల వెస్ట్ ఇండీస్ తో ఇంగ్లాండ్ జట్టు ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ఆయన ఆడిన చివరి మ్యాచ్. ఆండర్సన్ ఇప్పటికే టి20, వన్ డే క్రికెట్ ఫార్మాట్ నుంచి సన్యాసం తీసుకున్నారు. 

ఆయన పేరు ఉన్న రికార్డ్స్ ఒకసారి చూద్దాం. ఆండర్సన్ 2003 మే నెలలో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ ఇంగ్లాండ్ లార్డ్స్ మైదానంలో జింబాబ్వే, ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఆండర్సన్ తన కెరీర్ మొత్తంలో 188 టెస్టు మ్యాచ్ లలో ఆడాడు. ఈ 188 టెస్టు మ్యాచ్ లలో ఆండర్సన్ 350 ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసి 704 వికెట్లు తీశాడు.

Advertisement

Also Read: James Anderson Retirement| జేమ్స్ ఆండర్ సన్ రిటైర్మెంట్.. సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ రియాక్షన్

టెస్టు క్రికెట్ లో ఆయన యావరేజ్ 26.46, ఎకానమీ 2.79 ఉంది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల లిస్టులో ఆయన మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల్లో శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్, అస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఉన్నారు. మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు తీస్తే.. షేన్ వార్న్ 708 వికెట్లు సాధించాడు. అయితే వీరిద్దరూ స్పిన్ బౌలర్లు. టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా జేమ్స్ ఆండర్సన్ పేరున రికార్డ్ ఉంది. ఈ రికార్డ్ బ్రేక్ చేయడం చాలా కష్టం.

Advertisement

ఇవే కాకుండా టెస్టు క్రికెట్ లో ఆయన అత్యధికంగా 40 వేల బాల్స్ వేసిన ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. అలాగే వన్ డే క్రికెట్ లో 50 వేల బాల్స్ వేసిన రికార్డ్ కూడా ఆండర్సన్ పేరునే ఉంది. వన్ డే క్రికెట్ లో ఆయన ఏకంగా 400 మ్యాచ్ లలో బౌలింగ్ చేశాడు.

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×