BigTV English

Arvind Kejriwal : ‘కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందని తెలిసే సిబిఐ అరెస్టు చేసింది.. అంతా రాజకీయం’

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయినా కేజ్రీవాల్ జైలు నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఇదంతా రాజకాయ కారణాలతోనే జరుగుతోంది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సుప్రీం కోర్టు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ మీడియా ముందు ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

Arvind Kejriwal : ‘కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందని తెలిసే సిబిఐ అరెస్టు చేసింది.. అంతా రాజకీయం’

Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయినా కేజ్రీవాల్ జైలు నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఇదంతా రాజకాయ కారణాలతోనే జరుగుతోంది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సుప్రీం కోర్టు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ మీడియా ముందు ఘాటు వ్యాఖ్యాలు చేశారు.


ఢిల్లీ మధ్యం పాలసీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన కేబినెట్ మంత్రులు అవినీతి పార్పడ్డారని ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్టు చేసింది. కేజ్రీవాల్ తన అరెస్టు చట్ట వ్యతిరేకమని ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దాదాపు మూడు నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు. జూలై 12న సుప్రీం కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ బెయిల్ తీర్పు వెలువడే కొద్ది రోజుల ముందు సిబిఐ అధికారులు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీ నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. అంటే జైలులో ఉన్న వ్యక్తి మళ్లీ అరెస్టు చేయడం.

Also Read| రైతులను తుపాకీతో బెదిరిస్తూ ట్రైనీ ఐఏఎస్ అధికారి తల్లి హల్‌చల్‌


ఇప్పుడు ఈడీ.. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వేసిన కేసులో ఆయనకు బెయిల్ లభించినా.. సిబిఐ కేజ్రీవాల్ ను విడిచిపెట్టదు. దీనిపై మీడియాకు కేజ్రీవాల్ లాయర్ అభిషేక్ సింఘ్వీ వివరణ ఇస్తూ.. ఇది ఒక రాజకీయ కుట్ర అని స్పష్టంగా కనబడతోందని ఘూటుగా విమర్శించారు.

“సిబిఐ, ఈడీ ఈ రెండు విచారణ ఏజెన్సీలు ఒక నేరారోపణపై కేజ్రీవాల్ ను విచారణ చేస్తున్నారు. మరి ఆ ఆరోపణలపై సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చినా.. సిబిఐ ప్రత్యేకంగా కేజ్రీవాల్ ను కస్టడీలో ఉంచడం.. ఎలా కరెక్ట్. కేజ్రీవాల్‌ను బయటికి రాకుండా చేయాలనే ముందుగా సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. 2023లో సిబిఐ అధికారులు కేజ్రీవాల్‌ను ఈ కేసులో విచారణ చేశారు. మళ్లీ 2024 మార్చిలో ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన కస్టడీలో ఉండగా మళ్లీ అరెస్టు చేయడమేంటి?.. ఒక నేరారోపణలో సిబిఐ, ఈడీ విచారణ చేయడం చాలా కేసుల్లో చూశాం.. కానీ ఇలా కస్టడీలో ఉండగా.. మళ్లీ అరెస్టు చేయడాన్ని ముందస్తు అరెస్ట్ అంటే ఇన్సూరెన్స్ అరెస్ట్ అని అంటారు. దీనికి వెనుక రాజకీయమే ఉంది. మరే కారణం లేదు.” అని అభిషేక్ సింఘ్వీ అన్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×