Viral Video: యూపీలో కొత్త కొత్త విచిత్రాలు చోటు చేసుకుంటాయి. ఆ మధ్య కాబోయే అల్లుడితో అత్త వెళ్లిపోయింది. ఆ తర్వాత కోరుకున్న ప్రియుడికి భార్యని ఇచ్చిన పెళ్లి చేశాడు ఆమె భర్త. ఇప్పుడు పబ్‌జీ గేమ్‌లో పరిచయమైన లవర్ కోసం ఫ్యామిలీని వదిలేసింది ఓ మహిళ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
ప్రేమకు హద్దులు లేవని అంటారు. ఆ మాట ఎందుకన్నారో తెలీదు. కానీ ఉత్తరప్రదేశ్‌లో విచిత్రం చోటు చేసుకుంది. బాంద జిల్లాకు చెందిన ఆరాధనకు మూడేళ్ల కిందట మొహాబలోని శీలు అనే యువకుడితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాదిన్నర బాబు ఉన్నాడు.
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడంతో ఇంటి దగ్గర PUBG గేమ్‌కు అడిక్ట్ అయ్యింది ఆరాదన. పబ్జీ గేమ్ గురించి చెప్పనక్కర్లేదు. అందులో పడితే ఈ ప్రపంచాన్ని మరిచిపోతారు. అలాంటి పిచ్చి గేమ్ అది. గేమ్ ఆడుతూ శివమ్ అనే వ్యక్తితో ఆరాధనకు పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత ఆరాధన-శివమ్ ఇద్దరు కలిసి రెగ్యులర్‌గా పబ్‌జీ గేమ్‌ని ఎంజాయ్ చేసేవారు. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్ షిప్‌గా మారింది. చివరకు లవ్‌కు దారి తీసింది. ఇంకేముంది ఇద్దరు ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. శివమ్.. సొంతూరు పంజాబ్‌లోని లూథియానాకు చెందిన వ్యక్తి.
ALSO READ: శ్రీకాకుళంలో మేఘాలు నేలపై పడ్డాయా? అసలు నిజం ఇదే
ఆరాధన-శివమ్ జీవితంలో ఒకటి అవ్వాలని నిర్ణయించుకున్నారు. తనను భర్త కొడుతున్నాడని చెప్పి లుథియానా నుంచి ఇంటికి ప్రియుడ్ని రప్పించింది ఆరాధన. సింపుల్‌గా చెప్పాలంటే వందల కిలోమీటర్లు దాటి వచ్చేశాడు. ఆరాధన భర్తతో పాటు కుటుంబసభ్యులు శివమ్‌ను చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆరాధన-కుటుంబసభ్యుల మధ్య పెద్ద గొడవ జరిగింది.
కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు ఎంత చెప్పినా ఆరాధన వినలేదు. చివరకు భర్తను, బాబుని వదిలేసి పబ్‌జీ లవర్ శివమ్‌తో వెళ్తానని మనసులోని మాట బయపెట్టింది. తన ప్రేమకు అడ్డుపడితే 55 ముక్కులుగా నరుకుతానని భర్తని బెదిరించింది. నరికి ముక్కలను డ్రమ్‌లో వేస్తానని భర్తను సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పేరుకే ఆరాధన.. పనులు శివంగి మాదిరిగా ఉన్నాయి.
ఈ వ్యవహారంపై ఆరాధన భర్త శీలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పబ్‌జీ లవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. శివమ్‌ని అరెస్టు తీసుకెళ్తుంటే ఆరాధన కూడా పోలీస్ స్టేషన్ వెళ్లింది. తన లవర్‌ని వదిలిపెట్టాలని, అతడితో వెళ్లిపోతానని తెగేసి చెప్పేసింది. భర్త తాగుబోతని నిత్యం హింస పెడుతున్నాడని ఇంటి రహస్యాలు బయటపెట్టింది.
అందుకే శివమ్‌తో కలిసి వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. చివరకు ఆరాధన-శివమ్ వ్యవహారం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వద్దకు వెళ్లింది. తహసీల్ కార్యాలయంలో పెద్ద డ్రామా జరిగింది.ప్రేమికుడితో వెళ్లాలనుకుంటున్నానని ఆరాధన చెప్పింది. తాను భర్తను కాదు.. ప్రేమను కోరుకుంటున్నానని చెప్పింది. చివరకు ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.
एक हजार किलोमीटर दूर से शादी शुदा प्रेमिका के पास पहुंचा प्रेमी
ऑनलाइन गेम पब्जी खेलने के दौरान हुई थी दोनों की मुलाकात
शादी के 3 साल बाद बच्चे और पति को छोड़कर प्रेमी के साथ जाने की जिद पर अड़ी प्रेमिका
प्रेमिका के पति की शिकायत पर पुलिस ने प्रेमी के खिलाफ क़ी… pic.twitter.com/aHjDsbnRy0
— News1India (@News1IndiaTweet) June 26, 2025