BigTV English

Manchu Manoj: ఇంటి నుంచి గెంటేసినా.. తండ్రి కోసం ఆ పని చేసిన మనోజ్

Manchu Manoj: ఇంటి నుంచి గెంటేసినా.. తండ్రి కోసం ఆ పని చేసిన మనోజ్

Manchu Manoj: మంచు ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం అని చెప్పి నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం మంచు ఫ్యామిలీకి అలవాటుగా మారింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న మోహన్ బాబు వేరు.. అప్పుడున్న మోహన్ బాబు వేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి మోహన్ బాబు సినిమా వస్తుంది అంటే ఇప్పుడు కనీసం పట్టించుకునే నాధుడు లేడు అంటే ఆశ్చర్యం లేదు. అందుకు కారణం వారు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవ్వడమే.


 

మోహన్ బాబు నట వారసుడిగా విష్ణు తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తండ్రిలానే కొడుకు కూడా మంచి కథలను ఎంచుకొని ఆయన పేరు నిలబడతాడేమో అని అనుకున్నారు. కానీ విష్ణు ఆ పని చేయలేకపోయాడు. తను మాట్లాడే మాటలు, ఓవరాక్షన్ వల్ల సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కు గురయ్యాడు. అసలు మంచు కుటుంబం నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే అభిమానులు కూడా సీరియస్ గా తీసుకోవడం మానేశారు. ఇక ఈ మధ్య మంచు బ్రదర్స్  ఆస్తి వివాదాలు ఏ రేంజ్ లో హీటెక్కించాయో అందరికీ తెలిసిందే.


 

మంచు విష్ణు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరి కేసులు పెట్టుకోవడం, దాడులు జరుపుకోవడం, మోహన్ బాబు సైతం మనోజ్ పై కేసులు పెట్టడం, మనోజ్ ను ఇంటినుంచి బయటకు గెంటేయడం ఇలా ఒకటి అని చెప్పలేము. గత కొన్ని రోజులుగా వీరి కుటుంబం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక మంచు కుటుంబం లో ఉన్నవారందరూ వేరు..మనోజ్ ఒక్కడు వేరు అని చెప్పొచ్చి. మోహన్ బాబు, విష్ణుల్లా ఓవర్ యాక్షన్ చేయకుండా.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక సినిమాల  విషయంలో కూడా మనోజ్ సెలక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన మనోజ్.. పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన ఇండస్ట్రీకి దూరమయ్యాడు.

 

మొదటి భార్యతో విడాకులు, భూమా మౌనికను ప్రేమించడం, ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవడం.. ఇలా ఎన్నో అడ్డంకులు అతనిని ఊపిరి ఆడకుండా చేశాయి. ఇక అంతా సెట్ అయ్యాక మనోజ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్యనే ఆయన నటించిన భైరవం సినిమా రిలీజ్ అయ్యి మంచి ప్రశంసలను దక్కించుకుంది. ముఖ్యంగా మనోజ్ నటనకు ఫాన్స్ ఫిదా అయ్యారు. అచ్చం మోహన్ బాబును చూసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా తరువాత మనోజ్ మిరాయ్ లో కనిపించబోతున్నాడు.

Prabhas: రుద్ర పాత్ర కోసం ఆ హీరోని అనుకున్నారా.. అట్టర్ ప్లాప్ అయ్యేది కదరా బాబు?

 

సినిమాల విషయం పక్కన పెడితే.. మనోజ్ మనసు చాలా మంచిది. ఎన్ని చేసినా తండ్రిపై ప్రేమను ఏరోజు మనోజ్ పోగొట్టుకోలేదు. విష్ణు వలనే మోహన్ బాబు అలా మారాడని, ఆయనను కలిసి మాట్లాడితే అన్ని సమస్యలు తీరిపోతాయనీ కానీ, విష్ణు అడ్డుపడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అన్ని కుదిరితే తండ్రితో ఉండాలని ఉందని, తన కూతురును ఆయన ఒడిలో పెట్టాలనీ ఉందని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఆ ప్రేమతోనే మనోజ్.. కన్నప్ప సినిమాను వీక్షించడం జరిగింది. నేటి ఉదయం ప్రేక్షకులతో కలిసి ఐమాక్స్ లో మనోజ్ కన్నప్ప సినిమాను వీక్షించాడు.

 

నిన్నటికి నిన్న కన్నప్ప చిత్రబృందానికి మంచు విష్ణు పేరు లేకుండా బెస్ట్ విషెస్ చెప్పిన మనోజ్.. ఈరోజు ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడడం విశేషం. తండ్రి మోహన్ బాబు కోసమే మనోజ్ ఈ సినిమా చూసినట్లు తెలుస్తోంది. ఎంత అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉన్నా.. తండ్రి ప్రేమను వదులోకోలేని విష్ణు.. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కన్నప్పను చూసి సంతోష పడ్డాడు. ఇక థియేటర్ వద్ద మనోజ్ ను చూసిన అభిమానులు ఇంటి నుంచి గెంటేసినా కూడా ఎలా అన్నా తండ్రిపై ఇంత ప్రేమ పెంచుకున్నావ్.. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ తిరిగిన వాహనంపై కఠిన చర్యలు.. అసలేమైందంటే?

OG Movie: ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. డీవీవీ ట్వీట్‌తో డిసప్పాయింట్‌ అవుతున్న అభిమానులు

Shruti Haasan: బ్లాక్ కలర్ సెంటిమెంట్ వెనక ఇంత కథ ఉందా?

Coolie War 2 films: అక్కడ రెడ్ అలెర్ట్… కూలీ, వార్ 2 సినిమాలకు భారీ నష్టం!

Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి!

Sridevi: శ్రీదేవి మరణించినా చెల్లి రాకపోవడానికి కారణం.. 2 దశాబ్దాల మౌనం వెనుక ఏం జరిగింది?

Big Stories

×