E-Paper
Advertisement

Viral Video: టికెట్ లేదని ట్రావెలర్‌పై రైల్వే అధికారి దాడి, వీడియో వైరల్

Viral Video: టికెట్ లేదని ట్రావెలర్‌పై రైల్వే అధికారి దాడి, వీడియో వైరల్
Advertisement

Viral Video: కారణం ఏమైనా కావచ్చు.. కేవలం టికెట్ లేదన్న ఒక్క కారణంతో ప్రయాణికులపై తన ప్రతాపం చూపించాడు ఓ రైల్వే అధికారి. తన మాట వినాలని ఆ వ్యక్తి చెప్పినా వినలేదు. పైగా ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. చివరకు ఈ వ్యవహారం NCM India కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ విభాగం రియాక్ట్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

ట్రావెలర్‌పై రైల్వే అధికారి దాడి

Advertisement

సమయం, ఎప్పుడు, ఎక్కడ అనేది కాసేపు పక్కనబెడదాం. రైల్వేస్టేషన్‌లో పాసింజర్‌పై చేయి చేసుకున్నాడు రైల్వే ఉద్యోగి. టికెట్ లేకపోవడమే అందుకు కారణమని రైల్వే ఉద్యోగి చెబుతున్నమాట. పాసింజర్-రైల్వే ఉద్యోగి మధ్య దాదాపు అరగంటకు పైగానే ఈ తతంగం నడిచింది. కేవలం 15 సెకన్ల వీడియో మాత్రమే వెలుగులోకి వచ్చింది.

పాసింజర్ షర్ట్ లాగుతూ అటు ఇటు తోయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నవాగ్వాదం చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగికి సపోర్టుగా ఓ మహిళ.. పాసింజర్ బ్యాగ్ లాగుతూ కనిపించింది. ఈ దృశ్యాన్ని స్టేషన్‌లో ఉన్న మిగతా పాసింజర్లు తమ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఆపై సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆపై గిరగిరా తిరిగేస్తోంది ఆ వీడియో.

Advertisement

ప్రశ్నలు రైజ్ చేస్తున్న నెటిజన్స్

ఈ వ్యవహారంపై NCM India కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ స్పందించింది. రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం ముమ్మాటికీ నేరం. అందుకు జరిమానా విధించవచ్చు. కానీ, టికెట్ చెల్లించనివారిపై అధికారులు దాడి చేయడం చట్టరీత్యా నేరం అవుతుందని రాసుకొచ్చింది. జరిమానా విధించడం చట్టబద్ధమే కానీ, నిందితులపై భౌతిక దాడులకు దిగకుండా ఉండటం అధికారుల బాధ్యతని పేర్కొంది.

ALSO READ: సీటుపై కాలు.. చేతిలో ఉమ్మి, ఇండియన్ ట్రైన్ జర్నీపై యూకె ట్రావలర్ షాకింగ్ కామెంట్స్

ఆ వీడియో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ముమ్మాటికీ తప్పుగా వర్ణిస్తున్నారు. శాంతి భద్రతలంటే హింస కాదని అంటున్నారు. రైల్వే సిబ్బందిపై చర్య తీసుకునే హక్కు ఉందని అంటున్నారు.  ఆ వ్యక్తికి ప్లాట్‌ఫామ్‌లో టికెట్ ఎందుకు ఇవ్వలేరు? అంతా డిజిటల్‌గా మారిన ఈ రోజుల్లో మెట్రో స్టేషన్ల మాదిరిగా చెల్లింపు కోసం QR ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తున్నవాళ్లు లేకపోలేదు. కేవలం ప్లాట్‌ఫామ్‌ టికెట్ కోసం స్టేషన్‌లో గంటల కొద్దీ నిలబడటం చాలా సమయం వృధా అని వ్యాఖ్యానిస్తున్నారు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×