BigTV English

Viral Video: డ్రైవర్ లేకుండానే కదులుతున్న కారుపై వ్యక్తి విన్యాసాలు..

Viral Video: డ్రైవర్ లేకుండానే కదులుతున్న కారుపై వ్యక్తి విన్యాసాలు..

Viral Video: సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేసి ఫేమస్ అవ్వాలని కొంతమంది వ్యక్తులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణతో చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలి వారి వరకు రీల్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అందరూ చేసే విధంగా రీల్స్ చేస్తే తాము ఫేమస్ అవ్వలేమని కొంతమంది ఏకంగా సాహసాలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. కార్లు, లారీలు, బైకుల మీద స్టంట్లు వేస్తూ మరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ ఘటనలు ఆగడం లేదు.


తాజాగా ముంబైలో ఇటువంటి తరహాలోనే ఓ ఘటన వెలుగుచూసింది. ఓ ఫ్లైఓవర్‌పై నుంచి ఓ వ్యక్తి కారుపై విన్యాసాలు ప్రదర్శించాడు. ఏకంగా కారుపైకి ఎక్కి మరి సాహసాలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మారుతీ కారుపై ఓ యువకుడు చేసిన పనికి నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

ఓ యువకుడు ఓ ఫ్లైఓవర్ పై కారు నడుపుతూ వెళ్లాడు. ఈ తరుణంలో కారు డ్రైవింగ్ చేస్తూ హఠాత్తుగా కారు డోరు తీశాడు. అనంతరం డోరుపై నిల్చుని ప్రదర్శనలు చేశాడు. అనంతరం ఆ డోరుపై నుంచి కారుపైకి ఎక్కాడు. అయితే ఆ కారులో డ్రైవింగ్ చేస్తూ కూడా ఎవరూ లేరు. దీంతో ఆటోమెటిక్ గా కదులుతున్న కారుపై విన్యాసాలు చేస్తున్న వీడియోను కూడా వెనక వస్తున్న కొంత మంది వీడియోలు తీశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోపై ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. యువకుడిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.


Related News

Gigi Hadid: కేవలం ఆ టేపు చుట్టుకుని నడిచినందుకు రూ.80 కోట్లు చెల్లించారట.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటీ?

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Shocking: శిశువును ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోయిన తల్లి.. వామ్మో ఇదేం ఘోరం?

Meenu Raj: ఒకప్పుడు తిండి లేక పస్తులు.. ఇప్పుడు చేతినిండా డబ్బు, పెద్ద ఇల్లు.. ఈమె ఎవరో తెలుసా?

×