BigTV English

Ration Dealers: రేషన్ షాపుల్లో సన్న బియ్యం, సబ్సిడీకి గోధుమలు

Ration Dealers: రేషన్ షాపుల్లో సన్న బియ్యం, సబ్సిడీకి గోధుమలు

Fine Rice: తెల్ల రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. జనవరి నుంచి చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే.. సబ్సిడీకి గోధుమలను అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ డీలర్ల భర్తీ చేపడుతున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి, విధానాలనున తయారు చేయాలని, వీలైనంత త్వరగా భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.


పేదలు ఆహారం కోసం ఎన్నో కష్టాలు పడుతారని, వారికి సన్న బియ్యం అందించాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అదే సందర్భంలో డీలర్లకు వార్నింగ్ ఇచ్చారు. పీడీఎస్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడితే డీలర్షిప్ రద్దు చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి మచ్చ తెస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. రేషన్ డీలర్ల ఆదాయం పెంపునకు ప్రణాళికలు వేస్తున్నామని, వారి న్యాయమైన కోర్కెలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని వివరించారు.

Also Read: Revanth Reddy: హస్తినలో సీఎం.. ఆరుగురికి మంత్రులుగా అవకాశం?


ప్రభుత్వ వసతి గృహలతోపాటు అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు విసురుతున్న తరుణంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.

Related News

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

Big Stories

×