BigTV English

Viral Video: అవసరమా బ్రో ఇలాంటి స్టంట్స్.. ప్రాణాలు పోతే ఎవరిది భాద్యత..

Viral Video: అవసరమా బ్రో ఇలాంటి స్టంట్స్.. ప్రాణాలు పోతే ఎవరిది భాద్యత..

Viral Video: ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియా హవా నడుస్తుంది. ఫేమస్ అవ్వాలనే ఆలోచనతో ఎలాంటి విన్యాసాలు చేయడానికి అయినా సరే వెనుకాడడం లేదు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా మరి స్టంట్స్ వేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వాహనాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. రైలు, కార్లు, బైక్స్ అంటూ దేనిపై పడితే దానిపై స్టంట్స్ వేస్తున్నారు. ఇందులో రైలుపై విన్యాసాలు చేస్తూ తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.


తాజాగా ఓ యువకుడు రైలుతో విన్యాసాలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది. ముంబైలోని సబర్బన్ లోకల్ రైలులో ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఒక యువకుడు ఓ కాలు, చేయిని కోల్పోయాడు. ఈ ఘటన జూలై 14న సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఫర్హత్ ఆజం షేక్ అనే యువకుడు కదులుతున్న రైలును పట్టుకుని విన్యాసాలు చేశాడు. రైలు కిటికీ డోరును పట్టుకుని వేలాడుతూ ప్రయాణించాడు. ఈ తరుణంలో ఓ కాలు, చేయిని కోల్పోయాడు. ఈ తరుణంలో ఆర్పీఎఫ్ సిబ్బంది యువకుడిపై కేసు నమోదు చేశారు.

ఇలాంటి విన్యాసాలు మరోసారి జరగకుండా ఉండేందుకు యువకుడు చేసిన స్టంట్స్ కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం ఆ యువకుడు కాలు, చేతులు కోల్పోయిన వీడియోను కూడా పోస్ట్ చేసి ఇంకోసారి ఎవరు ఇటువంటి విన్యాసాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. అంతేకాదు ప్రమాదకరమైన విన్యాసాలు చేయకుండా కఠినమైన హెచ్చరికను జారీ చేసినట్లు సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చట్టవ్యతిరేక చర్యల ప్రమాదాల గురించి వివరిస్తూ, షేక్ పరిస్థితిని సోషల్ మీడియాలో విడుదల చేసింది.


Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×