BigTV English

Mamata Banerjee| ‘నీతి ఆయోగ్ మీటింగ్‌లో మమత మైక్ మ్యూట్ చేయలేదు’.. వివాదంపై స్పందించిన కేంద్రం

Mamata Banerjee| ‘నీతి ఆయోగ్ మీటింగ్‌లో మమత మైక్ మ్యూట్ చేయలేదు’.. వివాదంపై స్పందించిన కేంద్రం

Mamata Banerjee| ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన తొమ్మిదో నీతి ఆయోగ్ మీటింగ్‌ మధ్య లోనుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లిపోయారు. ఆ తరువాత అలా చేయడానికి గల కారణాన్ని మీడియా ముందు చెబుతూ.. మీటింగ్ మధ్యలో తాను మాట్లాడుతుండగానే తన మైకు మ్యూట్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.


”ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడే సమయం మించిపోయింది. అయినా ఆమె మాట్లాడుతూనే ఉన్నారు. ఆల్ఫబెటకల్ ఆర్డర్ ప్రకారం.. ఆమె మాట్లాడే సమయం మధ్యాహ్నం లంచ్ తరువాత వస్తుంది. కానీ ఆమె త్వరగా తిరిగి వెళ్లాలని కోరడంతో ఆమెకు ఏడవ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు.” అని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో చెప్పింది.

ఆ తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మమతా బెనర్జీ ఆరోపణలపై మాట్లాడారు. ”మేమంతా మీటింగ్ లో ఉన్నాం. మమతా బెనర్జీకి మాట్లాడే అవకాశం ఇచ్చాం. ఆమె మీడియా ముందు తన మైక్ మ్యూట్ చేశారని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా అబద్ధం. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆమె ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఆమె నిజం మాత్రమే చెప్పాలి.. అంతే కానీ అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయకూడదు,” అని సీతారామన్ అన్నారు.


‘చంద్రబాబు 20 నిమిషాలు మాట్లాడారు.. మరి నాకంత సమయం ఎందుకివ్వలేదు’
నీతి ఆయోగ్ మీటింగ్ లో నుంచి బయటికొచ్చాక మమత బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ..”నేను నీతి ఆయోగ్ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి 20 నిమిషాలు కేటాయించారు. అస్సాం, గోవా, ఛత్తీస్ గడ్ సిఎంలకు 12 నిమిషాలిచ్చారు. నేను 5 నిమిషాలు కూడా మాట్లాడకముందే నన్ను ఆపేశారు. నా మైక్ మ్యూట్ చేశారు. ఇది అన్యాయం. నేను మాత్రమే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రిని. మిగతా ఎవరూ రాలేదు. వారంతా మీటింగ్ ని బహిష్కరించారు. అయినా నేను కలిసి పనిచేసందుకు వచ్చాను. నేను వచ్చినందుకు సంతోషించాలి. బడ్జెట్ లో కూడా ఇలాగే చేశారు. ఇది రాజకీయ బడ్జెట్. రాష్ట్రాల పట్ల ఈ వివక్ష ఎందుకు చేస్తున్నారు. ఇది నాకు జరిగిన అవమానం కాదు. ప్రాంతీయ పార్టీలకు జరిగిన అవమానం. అయినా నీతి ఆయోగ్ కు ఎలాంటి అధికారాలు లేవు. అలా అయితే ప్లానింగ్ కమిషన్ విధానమే మళ్లీ తీసుకురావాలి,” అని బెంగాల్ సిఎం ఫైర్ అయ్యారు.

Also Read: లండన్ వీసా మాయలో మోసపోయిన మహిళ.. డబ్బులు దోచుకొని సామూహిక అత్యాచారం చేసిన ఏజెంట్లు

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×