E-Paper
Advertisement

Gold & Silver Pani Puri: గోల్డ్, సిల్వర్ పానీపూరీ.. ఎప్పుడైనా దీన్ని టేస్ట్ చేశారా?

Gold & Silver Pani Puri: గోల్డ్, సిల్వర్ పానీపూరీ.. ఎప్పుడైనా దీన్ని టేస్ట్ చేశారా?
Advertisement

Gold and Silver Pani Puri: పానీపూరి అంటే ప్రస్తుతం చాలా మందికి ఫేవరెట్. పానీపూరీ అనే పేరు వింటేనే నోటిలో నీళ్లూరిపోతుంటాయి. రోడ్డుపై పానీపూరీ ఎక్కడ కనిపించినా సరే లాగించేస్తుంటారు. ఇక పానీ పూరీలని గప్ చుప్ అని కూడా పిలుస్తుంటారు. ఈ పానీపూరీలో అనేక రకాలు ఉంటాయి. అయితే పానీపూరీ లవర్స్‌కు మాత్రం పానీపూరీలు చూపిస్తే ఇక వెంటనే గుటుక్కున నోట్లో వేసేకుంటారు. అంత పిచ్చి మరి పానీపూరీలు అంటే. అయితే ప్రస్తుతం వినూత్నంగా చేస్తున్న ప్రయోగాలతో.. పానీపూరీలపై కూడా ఓ ప్రయోగం లాంటిదే జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా గోల్డ్ అండ్ సిల్వర్ పానీపూరీలను తయారుచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ప్రస్తుతం బయట తినాలి అనుకునే ఫుడ్‌లలో పానీపూరీనే ముందు గుర్తుకొస్తుంది. అయితే తాజాగా ఓ వ్యక్తి చేసి గోల్డ్ అండ్ సిల్వర్ పానీపూరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. పానీపూరీ గోల్డ్ అండ్ సిల్వర్ లో దానిని పప్పు, ఆలూ, చింత రసంతో కాకుండా విచిత్రంగా డ్రైఫ్రూట్స్‌తో చేశాడు. పానీపూరీలో పిస్తా, బాదం వంటి పప్పులను వేసి తయారుచేశాడు.

Advertisement

Also Read: ప్రెజర్ కుక్కర్‌లో ఎప్పుడైనా చపాతీలు చేయడం చూశారా.. ?

తొలుత పానీపూరీకి సంబంధించిన గోల్ గప్పాలను తీసుకున్నాడు. అనంతరం అందులో డ్రైఫ్రూట్స్ వేశాడు. బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి వేసి పక్కన పెట్టాడు. అందులో తేనెని వేశాడు. ఇక తర్వాత పానీపూరీపై బంగారు, వెండి పూత వేశాడు. బంగారు పూత వేసినవి బంగారు ప్లేట్లో.. వెండి పూత వేసినవి వెండి ప్లేట్లో వేసి వడ్డించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఓ యువతి తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు ఈ పానీపూరీని ఎవరైనా తింటారా అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

?">

Tags

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×