E-Paper
Advertisement

Roti Making in Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌లో చపాతీలు.. ఏం టాలంట్ గురూ..!

Roti Making in Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌లో చపాతీలు.. ఏం టాలంట్ గురూ..!
Advertisement

Chapathi Making in Pressure Cooker: చపాతీలు అంటే చాలా మందికి గుర్తొచ్చేది డైటింగ్. డైటింగ్ ప్రియులకు చపాతీలు అంటే ఇష్టంగా తింటుంటారు. వీరే కాదు ఉత్తర భారతదేశంలో చాలా మంది చపాతీలనే తమ ఆహారంగా తీసుకుంటుంటారు. అందుకే అక్కడి వెళితే భోజనం కోసం చూసే వారికి చాలా వరకు చపాతీలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ప్రస్తుతం ఎవరు చూసినా డైటింగ్‌ల పేరుతో బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. డైటింగ్ లో భాగంగా చపాతీలు, పుల్కాలు తీసుకుంటుంటారు. అయితే చపాతీలను తయారు చేసే విధానం అయితే సాధారణంగా అందరికీ తెలిసిందే.

ఒక్కొక్క రొట్టెను పిండితో తయారుచేసి దానిని పెనంపై కాల్చుతుంటారు. ఈ ప్రాసెస్‌ని చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. పిండిని కలిపి, దానిని తయారుచేసి రొట్టె పెనంపై కాల్చడం హుష్…. ఎంత పెద్ద తంటాలు రా అని తలపట్టుకుంటుంటారు. అయితే ఓ మహిళ చపాతీలను కాల్చడానికి ఓ కొత్త టెక్నిక్ వాడింది. పొయ్యి వద్ద ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొత్త పద్ధతిని ఫాలో అయింది. అసలు అలసటే లేకుండా చపాతీలు తయారుచేసే న్యూ టెక్నిక్ ను కనిపెట్టింది. ప్రస్తుతం ఈ మహిళ చేసిన కొత్త టెక్నిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

కేవలం నిమిషాల్లోనే ఓ మహిళ చపాతీలను తయారు చేసింది. దీని కోసం ఆమె ప్రెషర్ కుక్కర్ ను యూజ్ చేసింది. ముందుగా రొట్టెను తయారుచేయడానికి పిండిని కలిపి పెట్టింది. అనంతరం కలిపిన పిండితో ఐదు నుంచి ఆరు రొట్టెలను తయారుచేసింది. అవి పూరీల కంటే కాస్త పెద్ద సైజ్‌లో తయారుచేసింది. ఓ ప్రెషర్ కుక్కర్ తీసుకుని ముందుగా దానిని స్టవ్ పై పెట్టింది. అనంతరం కుక్కర్ లో చిన్న గిన్నెలో ఉప్పు తీసుకుని అందులో వేసింది.

Also Read: Viral Video: టిక్కెట్ లేని ప్రయాణం ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..?

Advertisement

ఆ తర్వాత ఆ ఉప్పుపై మరో గిన్నెను పెట్టింది. ఇక ఆ గిన్నెపై మొదటి రోటిని పెట్టింది. అలా 5,6 రోటీలను పేర్చింది. అనంతరం కుక్కర్ లాక్ చేసింది. కొన్ని నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూసింది. ఇక అవి ఆవిరికి తయారయ్యాయి. అనంతరం ఆ చపాతీలను తీసుకుని కొద్దిగా నెయ్యి వేసింది. వీటినే నెటిజన్లకు వీడియోలో చూపింది. ప్రస్తుతం మహిళ చేసిన చపాతీలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×