BigTV English

33 Died in Afghanistan Floods: ఆప్ఘాన్ ను ముంచెత్తిన వరదలు.. 33 మంది మృతి!

33 Died in Afghanistan Floods: ఆప్ఘాన్ ను ముంచెత్తిన వరదలు.. 33 మంది మృతి!

33 Killed in Afghan Floods: ఆఫ్ఘనిస్తాన్‌ ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 33 మంది ప్రాణాలు కోల్పోగా.. 27 మంది గాయపడ్డారు. దేశ రాజధాని కాబూల్‌తో పాటు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయని రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ తాలిబన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ తెలిపారు.


వరదల కారణంగా 600 కు పైగా ఇళ్లు దెబ్బతినగా.. దాదాపు 200 పశువులు చనిపోయాయని తెలిపారు. పశ్చిమ ఫరా, హెరాత్, దక్షిణ జబుల్, కాందహార్ ప్రావిన్సు ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 800 హెక్టార్లలో వ్యవసాయ భూమి దెబ్బతినగా.. 85 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నట్లు వెల్లడించారు.

పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల కోసం కూడా ఇళ్లలో నుంచి బయటకు రాలేక పోతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు దేశ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


Also Read : ప్రతీకారం తీరిందన్న ఇరాన్.. ప్రతిదాడి చేస్తామన్న ఇజ్రాయెల్.. అమెరికా ఆగ్రహం

ఆఫ్ఘనిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో రానున్న రోజుల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెస్క్యూ టీం లను రంగంలోకి దించిన అధికారులు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×