BigTV English
Advertisement

Alekhya Chitti Pickles: అవును తిడతాం.. అలేఖ్య చెల్లి రమ్య షాకింగ్ కామెంట్స్!

Alekhya Chitti Pickles: అవును తిడతాం.. అలేఖ్య చెల్లి రమ్య షాకింగ్ కామెంట్స్!

Alekhya Chitti Pickles Ramya Clarity: మనం పడే కష్టం.. చిన్న తప్పుతో తుడిచిపెట్టుకుపోతుంది. ప్రస్తుతం అలేఖ్య పికిల్స్ పరిస్థితి అలాగే ఉంది. ఆమె తన నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కష్టపడింది. సోషల్ మీడియా ద్వారా తన వ్యాపారాన్ని సక్సెస్‌ఫుల్‌గా సాగిస్తోంది. అయితే, సోషల్ మీడియా మనల్ని ఎంత పైకి ఎత్తుతుందో.. అంతే త్వరగా మనల్ని కింద పడేస్తుంది. పొగిడిన వాళ్లే తిట్టే పరిస్థితి వస్తుంది. మొన్నటి వరకు అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచిన అలేఖ్య.. తన ఆగ్రహాన్ని.. నోటిని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల భారీ మూల్యమే చెల్లిస్తోంది. చివరికి తన వ్యాపారాన్ని మూసేయాల్సిన పరిస్థితికి వచ్చింది.


కస్టమర్స్ పై నోరు పారేసుకున్న అలేఖ్య

ఓ కస్టమర్‌పై ఆమె బూతులతో నోరుపాడేసుకోవడం వల్ల.. సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కొంటోంది. ఇప్పటికే అలేఖ్య అక్క సుమి (సుమ) ఆ బూతులు తిట్టింది తాను కాదని క్లారిటీ ఇచ్చింది. తాజాగా అలేఖ్య చెల్లి రమ్య కూడా క్లారిటీ ఇచ్చింది. ఆ బూతులు తిట్టింది తన అక్క అలేఖ్య అని చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. ఇంతకీ ఆమె ఈ వీడియోలో ఏం చెప్పిందంటే..?


అక్క ఆడియోపై చెల్లి రమ్య క్లారిటీ

అసలు ఏం జరిగిందో తెలియకుండా చాలా మంది సోషల్ మీడియాలో తమను తిడుతున్నారని రమ్య ఆవేదన వ్యక్తం చేసింది.“అలేఖ్య చిట్టీ పికెల్స్ ఆడియో బయటకు వచ్చింది. చాలా కాంట్రవర్సీ అవుతోంది. న్యూస్ ఛానెల్స్ లో, మీమర్స్ బాగా వైరల్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? అనేది నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఒక ఆడపిల్ల అంత దారుణంగా బూతులు ఎలా తిడుతుంది? అని చాలా మంది అంటున్నారు. దానికి కారణం ఏంటని ఎవరూ ఆలోచించడం లేదు. వన్ సైడ్ గా ఆలోచించి జడ్జ్ చేస్తున్నారు. మాకు రోజు వందల కొద్దీ మెసేజ్ లు చాలా బ్యాడ్ గా వస్తున్నాయి. చాలా మంది పచ్చి బూతులు తిడతారు. వాటిని డిలీట్ చేస్తాం. కొంత మందిని బ్లాక్ చేస్తాం. కానీ, ఆడియో విషయంలో పొరపాటు జరిగింది. మా అక్కను తిట్టిన వ్యక్తికి పెట్టాల్సిన మెసేజ్ పొరపాటు వేరే అబ్బాయికి పెట్టింది. దాన్ని వెంటనే డిలీట్ చేసింది. కానీ, అతడు దాన్ని తనకే పంపించారు అని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాం. కానీ, మా వాట్సాప్ కు 35 వేల మందికి పైగా రిపోర్టు కొట్టారు. వాట్సాప్ ఓపెన్ కాలేదు. అందుకే స్పందించలేకపోయాం. మేం బ్యాడ్ మెసేజ్ చేసిన వ్యక్తికి సారీ చెప్పాం. అతడికి, అతడి కుటుంబ సభ్యులకు కూడా క్షమించమని అడిగాం. పొరపాటుగా మెసేజ్ పెట్టడం వల్లే ఈ వివాదం చెలరేగింది” అని చెప్పుకొచ్చింది.

అలాంటి వారిని తప్పకుండా తిడతాం- రమ్య

ఇక సోషల్ మీడియా ద్వారా ఎంతో నెగెటివిటీ ఎదుర్కొన్నట్లు రమ్య చెప్పుకొచ్చింది. “చాలా మంది పర్సనల్ గా బూతులతో అటాక్ చేశారు. వారి మీద కేసులు పెట్టాలి అనుకున్నాం. కానీ, యువకుల జీవితాలను ఇబ్బందుల్లో పెట్టకూడదని కేసులు పెట్టలేదు. మమ్మల్ని మరీ దారుణంగా తిట్టే వాళ్లను చాలా మందిని బ్లాక్ చేశాం. మరీ కోపం కలిగిస్తే ఎవరైనా తిడతారు. మా అక్క కూడా అలాగే తిట్టింది. మేం ముగ్గురం అమ్మాయిలం. మాకు చెప్పుకోవడానికి ఎవరూ లేరు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా కొంత మంది బూతులు తిట్టారు. మా అమ్మానాన్నలను తిడితే తట్టుకోలేకపోయాం. ఎవరైతే మా అక్కను టార్గెట్ చేసి తిట్టారో, వారిని మాత్రమే తను తిట్టింది. అమాయకులు ఎవరినీ తిట్టలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి” అని రమ్య చెప్పుకొచ్చింది.

Read Also:ఒసేయ్.. నీకెందుకే పచ్చళ్లు.. పాచిపని చేస్కో.. అలెఖ్య మరో ఆడియో లీక్!

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×