Alekhya Chitti Pickles New Audio: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అలేఖ్య చిట్టి పికెల్స్. పచ్చళ్ల ధర మరీ ఇంత ఎక్కువా? అని అడిగినందుకు ఓ కస్టమర్ పై బూతులు తిట్టి అందరినీ షాక్ కి గురి చేశారు. తాజాగా మరో ఆడియో బయటకు వచ్చింది. పచ్చళ్లు కొనేందుకు ప్రయత్నించిన ఓ లేడీ కస్టమర్ పైనా అలేఖ్య చిట్టి పికెల్స్ లో ఒకరు నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం చూసి ఇదేం పద్దతి అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజినెస్ చేసే వారికి ఓపిక ఉండాలే తప్ప, తలపొగరు ఉండకూడదని చీవాట్లు పెడుతున్నారు.
నీకెందుకే పచ్చళ్లు.. వెళ్లి పాచిపని చేస్కో!
తాజాగా వెలుగులోకి వచ్చిన అలేఖ్య చిట్టి పికెల్స్ ఆడియోలో అడ్డగోలుగా మాట్లాడ్డం షాక్ కి గురి చేసింది. ఇంతకీ ఆ ఆడియోలో ఏం ఉందంటే? “ఒసేయ్ పిచ్చి ముఖం దానా.. ఇంత తక్కువ ధరను కూడా నువ్వు భరించలేను. హై కాస్ట్. టూ మచ్ కాస్ట్. ఎక్స్ పెన్సివ్ అంటున్నావంటే.. నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని నాలుగు ఇళ్లు చూసుకుని పాచిపని చేసుకొని బతుక్కో..” అటూ హార్ష్ గా మాట్లాడింది. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చాలా మందితో ఇలాగే మాట్లాడిందని, బయటపెట్టుకుంటే పరువు పోతుందని చాలా మంది భయపడి విషయం బయటకు చెప్పలేదని మరికొంత మంది అంటున్నారు. ఇప్పుడు విషయం బయటకు రావడంతో ఒక్కొక్కరు తమ గురించి ఆమె మాట్లాడిన మాటలను షేర్ చేసుకుంటున్నారు.
Alekhya Chitti Pickles Noti Doola Max 🙏🤣
Ammai Ani Kuda Chudaledu🙅 https://t.co/pVV0SpbX4Z pic.twitter.com/0j334TB8P4— Johnnie Walker (@Johnnie5ir) April 3, 2025
నోటికి ఎంత వస్తే అంత మాట!
ఏపీలోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టారు. నెట్టింట తమకు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుంటూ బిజినెస్ బాగా పెంచుకున్నారు. వీళ్లు తయారు చేసే నాన్ వెజ్ పికెల్స్ కు మంచి డిమాండ్ ఉంది. రేట్లు మాత్రం మార్కెట్ వాల్యూతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా ఓ కస్టమర్ వాళ్లకు వాట్సాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. వాళ్లు చెప్పిన రేట్లు విని సదరు కస్టమర్ షాకయ్యాడు. మరీ ఇంత ధరా? అని అతడు రిప్లై ఇచ్చాడు. అతడి రిప్లై విని ముగ్గురు సిస్టర్స్ లో ఒకరు బూతులతో రెచ్చిపోయారు. తన ఫ్యామిలీ మెంబర్స్ ను, పర్సనల్ లైఫ్ ను టార్గెట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఆడియోను సదరు కస్టమర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో అలేఖ్య చిట్టి పికెల్స్ వెబ్ సైట్, వాట్సాప్ ను డిలీట్ చేశారు. వాస్తవానికి వీరు మాట్లాడే మాటలు, సోషల్ మీడియాలోనూ తరచుగా వివాదాలకు కారణం అయ్యాయి. ఎదుటివారు గోరంత మాట్లాడితే, వీళ్లు వేలంత మాట్లాడ్డం చాలాసార్లు చూశాం. ప్రస్తుతం ఆడియోలు లీక్ కావడంతో అక్కా చెల్లెళ్ల వ్యాపారం ప్రస్తుతానికి మూతపడింది.
Read Also: పచ్చళ్లు అమ్ముకోండి పర్వాలేదు.. ఆ పచ్చి బూతులు ఎందుకమ్మా?