BigTV English

Roja Vs Sharmila: రోజా వర్సెస్ షర్మిల.. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది

Roja Vs Sharmila: రోజా వర్సెస్ షర్మిల.. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది

వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల.. ఈ యుద్ధం మొదలై చాన్నాళ్లవుతోంది. ఈ గొడవలో వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ఎవరివైపు నిలబడ్డారనే విషయం అందరికీ తెలిసిందే. ఆస్తుల గొడవ, కంపెనీ వాటాల గొడవ.. ఇతరత్రా వైరం కాస్తా చివరకు రాజకీయ వైరంగా మారింది. గతంలో వైసీపీని నిలబెట్టేందుకు అన్న జగన్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు షర్మిల ఎంత కష్టపడ్డారో, గత ఎన్నికల్లో వైసీపీ పతనాన్ని ఆమె అంతగా కోరుకున్నారు. ఆ పంతం నెరవేర్చుకున్నారు. ఓటమి తర్వాత కూడా జగన్ తప్పుల్ని ఎత్తి చూపుతూ షర్మిల అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడారు. తాజాగా ఆమె వివేకా హత్య కేసుని ప్రస్తావిస్తూ.. ఆయన కుమార్తె సునీతకు ప్రాణ హాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పై బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు షర్మిల. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారని.. అధికారుల్ని కూడా అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని చెప్పారు. పరోక్షంగా జగన్ పై కూడా ఆరోపణలు చేశారు షర్మిల.


రోజా ఘాటు వ్యాఖ్యలు
ఇన్నాళ్లూ షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ నుంచి పెద్దగా కౌంటర్లు ఉండేవి కావు. ఒకవేళ ఫ్యూచర్ లో అన్న, చెల్లెలు కలిసిపోతే తమ సంగతి ఏంటనే భయంతో చాలామంది వైసీపీ నేతలు షర్మిల వ్యాఖ్యలపై స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు తొలిసారిగా మాజీ మంత్రి రోజా, షర్మిల కామెంట్లపై కాస్త ఘాటుగా స్పందించారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్న ఆమె జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి షర్మిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు రోజా. వివేకాను తామే చంపామని టీవీల్లో చెప్పినవారిని, అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతున్నారని, హంతకుల్నే ఇప్పుడు హీరోలుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మేలు చేయాలన్నదే షర్మిల తాపత్రయం అని, అదే ఆమె లక్ష్యం అని, ఆ విషయం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోందని చెప్పారామె. చివరికి జగన్ ని ఇబ్బందిపెట్టడమే షర్మిల అసలు గమ్యం అని అన్నారు.


టార్గెట్ జగన్

ప్రస్తుతానికి రోజా వ్యాఖ్యలను షర్మిల సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. అయితే ఆ వెంటనే షర్మిల మరోసారి జగన్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్లివ్వడం విశేషం. వివేకే హత్య కేసులో జగన్ ని పరోక్షంగా టార్గెట్ చేసిన ఆమె, సరస్వతి పవర్ షేర్ల బదిలీ విషయంలో అన్నను నేరుగా టార్గెట్ చేసి మాట్లాడారు. సొంత అమ్మకి బదిలీ చేసిన షేర్లను ఆయన తిరిగి అడుగుతున్నారని విమర్శించారు. తల్లిపై కేసు వేసిన కొడుకుగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారన్నారు. జగన్‌కు విశ్వసనీయత ఉందో లేదో ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలన్నారు.

వైసీపీ కౌంటర్లు

ఆస్తులు కాజేసిన మేనమామ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్లు రెడీ చేస్తోంది. బహుశా ఆ బాధ్యతను పార్టీ నేతలు రోజాకు అప్పగించినట్టున్నారు. ఇప్పటికే చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అంటూ రోజా, షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రోజా వ్యాఖ్యలకు షర్మిల స్పందిస్తే అప్పుడు అసలు కథ మొదలైనట్టు. ఇప్పటి వరకూ లైటర్ వే లో ఉన్న వాగ్యుద్ధం ఇక చినికి చినికి గాలివానలా మారే ప్రమాదం ఉంది.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×