Tamannaah Bhatia : ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) మిల్క్ బ్యూటీగా ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘హ్యాపీడేస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న ఈమె.. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాదు అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) వంటి అగ్ర కథానాయకులతో జతకట్టిన ఈమె తనకంటూ ఒక స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
ఇకపోతే ఇప్పుడు తెలుగులో ఓదెల 2 సినిమాతో ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. అటు తమన్న కూడా తన వంతు ప్రమోషన్స్ చేస్తూ సినిమా విజయవంతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ హీరోలపై తమన్నా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపై కుర్ర హీరోలతోనే సినిమాలు చేస్తా – తమన్నా.
తాజాగా తమన్నా మాట్లాడుతూ.. తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి ఫోకస్ చేస్తాను. అయితే హీరో ఎవరు అనే విషయం కంటే.. ముందుగా కథను మాత్రమే నమ్ముకుని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. ఈ క్రమంలోనే ఓదెలా 2 కి కూడా ఒప్పుకున్నాను. ముఖ్యంగా నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సీనియర్ హీరోలు అందరి సరసన సినిమాలు చేశాను. కాబట్టి ఇకపై కుర్ర హీరోలతో నేను నటించడానికి సిద్ధమవుతున్నాను అంటూ తమన్నా తెలిపింది.
అయితే ఇది విన్న నెటజన్స్ మాత్రం.. ముసలోళ్లు వద్దు, కుర్రాళ్లే ముద్దు అన్నట్టు వుంది అమ్మడి వ్యవహారం అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ట్రెండ్ కి తగ్గట్టుగా ఫాలో అయితేనే కెరియర్ ఉంటుందని, స్టార్ హీరోయిన్లు తెలుసుకుంటున్నారో ఏమో.. అందులో భాగంగానే ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ప్రియుడితో పెళ్లికి సిద్ధమైనట్టేనా..?
ఒక తమన్నా వ్యక్తిగత విషయానికి వస్తే.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడింది. అతడితో కలిసి చట్టపట్టలేసుకొని కూడా తిరుగుతోంది. ఇక ఇప్పుడు అతనితో పెళ్లికి సిద్ధమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరొకవైపు వీరు పెట్టే పోస్ట్లు చూస్తే మాత్రం ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక మరి విజయవర్మతో తమన్నా రిలేషన్ కొనసాగిస్తుందా లేక బ్రేకప్ చెప్పుకున్నారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. తమన్నా నటిస్తున్న ఓదెల 2 సినిమా విషయానికి వస్తే.. గతంలో వచ్చిన ‘ఓదెలా రైల్వే స్టేషన్’ సినిమా సీక్వెల్ గా ఓదెలా 2 రాబోతోంది. హెబ్బా పటేల్, తమన్నా, వశిష్ట ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. సంపత్ నంది రూపొందిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఏప్రిల్ 17న రాబోతున్న ఈ సినిమా పైన తమన్నా ఆశలు పెట్టుకోవడం గమనార్హం.