E-Paper
Advertisement

Amazon River: మీకు తెలుసా? అమెజాన్ నదిపై ఒక్క వంతెన కూడా నిర్మించలేదు.. ఎందుకంటే?

Amazon River: మీకు తెలుసా? అమెజాన్ నదిపై ఒక్క వంతెన కూడా నిర్మించలేదు.. ఎందుకంటే?
Advertisement

Amazon River: అమెజాన్ నది.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా, అదే సమయంలో అత్యంత ప్రమాదకరంగా ప్రవహించే నదులలో ఒకటి. సుమారు 6,400 కి.మీ పొడవుగా, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, పెరూ వంటి దేశాలను ఛేదిస్తూ ప్రవహించే ఈ మహానది ఎన్నో అద్భుతాలను, రహస్యాలను తనలో దాచుకుంది. ఇంత విస్తారమైన, భారీ నది అయినప్పటికీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు అమెజాన్‌ నదిపై ఒక్కటంటే ఒక్క వంతెన కూడా నిర్మించకపోవడమే. మనం సాధారణంగా పెద్ద నదులపై ఎన్నో వంతెనలు చూసే అలవాటుతో ఉన్నందున.. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలో అమెజాన్‌ నదిపై వంతెనలు ఎందుకు కట్టలేదు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? శాస్త్రవేత్తలు, పరిసరాల నిపుణులు ఏమంటున్నారు.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

దట్టమైన వృక్షసంపద:

అమెజాన్ నది ఎక్కువ భాగం దట్టమైన, వర్షాధార అడవుల మధ్య ప్రవహిస్తుంది. ఇక్కడ పెద్ద నగరాలు, ప్రధాన రహదారులు ఉండకపోవడం వలన వంతెన నిర్మాణ అవసరం చాలా తక్కువ. పైగా ఈ ప్రాంతం ప్రజలకు లేదా వాణిజ్యానికి పెద్దగా ఉపయోగం లేని చోటు. అంతేకాకుండా.. ఇంత పెద్ద నదిపై వంతెన నిర్మాణానికి అయ్యే భారీగా ఉండటం కూడా కారణమే.

Advertisement

Read Also: అక్కడ పెళ్లికాని మగాళ్లకు ఫుల్ డిమాండ్.. గంటలు లెక్కన భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్న స్త్రీలు!

భయంకరమైన నీటి మట్టం:

వర్షాకాలంలో అమెజాన్ నది సాధారణ వెడల్పును 30 మైళ్ల వరకు పెంచుతుంది. అనూహ్యమైన ఈ ప్రవాహ మార్పులు, నీటిస్థాయి పెరగడం వలన వంతెన పునాదులు నిలబడటం చాలా కష్టతరం అవుతుంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో వంతెన స్థిరంగా ఉండదని గణాంకాలు, పరిశీలనలు సూచిస్తున్నాయి.

మెత్తటి బురదే పెద్ద సవాలు:

Advertisement

అమెజాన్ నదీ తీరంలో ఉన్న మెత్తటి బురద (Soft Clay) కారణంగా.. వంతెనలకు బలమైన పునాదులు వేయడం కష్టమవుతుంది. ఇది సాంకేతికంగా పెద్ద సమస్య మాత్రమే కాదు.. ఆర్థికంగానూ వ్యయభారం ఎక్కువ. అందువల్ల.. వంతెన నిర్మాణానికి అవసరమైన ఖర్చు చాలా పెద్దదని పేర్కొనవచ్చు.

వంతెనల అవసరం లేకపోవడం:

ఈ రివర్ మీత వంతెనలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో రవాణా ప్రధానంగా పడవలు, ఫెర్రీలు, చిన్న విమానాల ద్వారా జరుగుతుంది. ఇవి తక్కువ నిర్వహణ ఖర్చుతో, స్థానిక ప్రజల రవాణా అవసరాలను సరళంగా తీర్చుతాయి. కాబట్టి.. వంతెనల అవసరం ఇక్కడ అంతగా ఉండదు.

పర్యావరణ పరిరక్షణే ప్రధాన కారణం:

అమెజాన్ అడవులు ప్రపంచంలో అత్యంత సున్నితమైన, జీవవైవిధ్యంతో నిండి ఉన్న ప్రాంతం. భారీ నిర్మాణాలు.. ముఖ్యంగా వంతెనల నిర్మాణం, ఈ అడవీ ప్రాంతానికి ప్రతికూల ప్రభావం చూపవచ్చు. చెట్లు, జంతువుల నివాస ప్రాంతాలు, నది పరిసరాలు.. ఇవన్నీ పునరుద్ధరించలేని నష్టానికి గురవుతాయి.

విద్య-వైద్యంపై పెట్టుబడి:

వంతెనలు అవసరం లేని ప్రాంతంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించడం కంటే.. ఆ డబ్బును స్థానిక ప్రజల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం వినియోగించడం ప్రభుత్వాలకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది.

ప్రకృతికి అనుగుణమైన జీవనం:

స్థానికులు ఎక్కువగా నదీ మార్గాన్నే ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగిస్తారు. వంతెనలు లేకపోవడం వల్ల వారి జీవన విధానం, సామాజిక ఆచారాలు మార్చకుండా, ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా కొనసాగుతాయి.

ప్రధాన కారణం ఇదే:

అమెజాన్ రివర్‌పై వంతెనలు నిర్మించడానికి అవసరమైన ఇంజనీరింగ్ పరిజ్ఞానం గతంలో అందుబాటులో లేకపోవడం.. అలాగే వలస పాలన ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వాలు నదీ ప్రాంతాలపై దృష్టి పెట్టకపోవడం కూడా కారణాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ నదిపై ఎలాంటి వంతెనలు నిర్మించే ప్రణాళికల్లేవు. అమెజాన్ నది భౌగోళిక సవాళ్లు, పర్యావరణ సున్నితత్వం దీనిని వంతెన లేని ప్రపంచపు గొప్ప నదిగా నిలబెడుతున్నాయి.

Read Also: పాము నోట్లో నోరు పెట్టి.. వామ్మో, అలా చేశావేంటి భయ్యా!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×