Betting Apps Promotion:గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ (Betting apps promotions) పూర్తిగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మొదలుకొని.. పాన్ ఇండియా స్టార్స్ వరకు చాలామంది డబ్బు కోసం కక్కుర్తిపడి తమకు జీవితాన్ని కల్పించిన ప్రజల జీవితాలను పణంగా పెట్టి,ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు డబ్బు సంపాదించారు. అయితే వీరిని నమ్మిన ఎంతోమంది ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి, అప్పుల పాలై, వాటిని కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంతో ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన రెండు ప్రభుత్వాలు.. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వారిపై కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వీ.సీ.సజ్జనార్ (VC Sajjanar) బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారి పాలిట యమగండం గా మారారు. ఇక ప్రస్తుతం దాదాపు చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆగిపోయిన విషయం తెలిసిందే.
రివ్యూ ఇస్తూ కోట్ల సంపాదన.. కానీ బుద్ధి మారదా..?
అటు మరోవైపు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్ల రూపాయలను వెనకేసుకున్నారో.. వారందరి గుట్టు రట్టు చేశారు ప్రముఖ యూట్యూబర్ ‘ప్రపంచ యాత్రికుడు.. నా అన్వేషణ అన్వేష్”(Naa Anveshana Anvesh). సెలబ్రిటీలు అని కూడా చూడకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ వారి రహస్యాలు బయటపెట్టిన ఈయన.. ఇప్పుడు ఆదిరెడ్డి (Adireddy ) , శ్రీముఖి (Sreemukhi) గురించి కూడా నిజాలు బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేసిన అన్వేష్.. అందులో ఆదిరెడ్డి గురించి మాట్లాడుతూ.. “ఆదిరెడ్డి కటిక పేదరికం నుండి వచ్చాడు. కూరగాయలను అమ్ముకుంటూ వీడియోలు తీసి రూ.100, రూ.200 పొందిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ కొంత కొంతగా ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. అయితే అదృష్టంతో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ బిగ్ బాస్ సీజన్ 7 కి రివ్యూ చెప్పి, సెప్టెంబర్ మొదలు డిసెంబర్ వరకు ఈ నాలుగు నెలలో సుమారుగా కోటి రూపాయల వరకు సంపాదించానని ఆయనే స్వయంగా చెప్పారు కదా.. మరి ఏం పోయేకాలం.. ఇంత డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు. అయినా మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు. ఇప్పటివరకు నేను ఒక 15 మందికి ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున బాధితులకు ఇచ్చుకుంటూ వచ్చాను. మీరు ఒక పది మందికి కనీసం లక్ష రూపాయలు అయినా ఉచితంగా ఇవ్వగలరా..? ఆ మనస్తత్వం మీకు ఉందా..? మరెందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు . ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలను వెనకేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు” అంటూ ఆది రెడ్డి పై ఫైర్ అయ్యారు అన్వేష్.
శ్రీ ముఖి అన్వేష్ ఫైర్..
అలాగే శ్రీముఖి (Sree Mukhi) గురించి కూడా మాట్లాడుతూ..” రెండు తెలుగు రాష్ట్రాలలో టాప్ మోస్ట్ యాంకర్ గా పేరు సొంతం చేసుకున్న శ్రీముఖి కూడా బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చింది. ఇప్పుడు చేతినిండా వరుస షోలతో బిజీగా మారింది. ఈమె కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నిలిపివేసినా కూడా ఇంకా శ్రీముఖి చేసిన బెట్టింగ్ యాప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అడిగితే నా తప్పులేదు అని చెప్పినా.. అక్కడ ఆమె గొంతు మార్చి వీడియో వైరల్ అవుతున్నా.. తప్పు మీదే కదా.. మీరు ఆ వీడియో చేయడం వల్లే కదా ఎంతోమంది మిమ్మల్ని నమ్మి అందులో పెట్టుబడి పెట్టి డబ్బులు కోల్పోయి ప్రాణాలు కోల్పోతున్నారు. కొంచమైనా బాధ్యత ఉండక్కర్లేదా?” అంటూ శ్రీముఖిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అన్వేష్.
also read:Thug Life Trailer: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఫుల్ మీల్స్ అంటున్న ఫ్యాన్స్..!