OTT Movie: కొరియన్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయాయి. తెలుగు సీరియల్స్ లో కుళ్ళు కుతంత్రాల మాదిరిగా కాకుండా, చూస్తున్నంత సేపు ఒక మంచి ఫీలింగ్ కలిగే విధంగా తీస్తున్నారు. అందుకే వీటికి ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ మాఫియా అనే ఒక గేమ్ చుట్టూ తిరుగుతుంది. విద్యార్థులు ఆ గేమ్ మల్ల చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్షణక్షణం ఉత్కంఠంగా ఈ సిరీస్ సాగుతుంది. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే, ఈ వెబ్ సిరీస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
యూఇల్ హై స్కూల్‌లోని విద్యార్థులు ఒక ట్రిప్ కి వెళతారు. వీళ్ళంతా ఒక యూత్ సెంటర్‌లో స్టే చేస్తారు. ఆ ప్రాంతం ఒక దట్టమైన అడవిలో ఉంటుంది. అక్కడ ఒక్కసారిగా విద్యార్థుల మొబైల్ నెట్‌వర్క్ పనిచేయడం మానేస్తుంది. టీచర్లు అత్యవసర పరిస్థితి కారణంగా బయటికి వెళ్లిపోతారు. విద్యార్థులు బయటి ప్రపంచంతో, సంబంధం లేకుండా ఒంటరిగా మిగిలిపోతారు. రాత్రి అవ్వగానే వారందరి ఫోన్‌లలో ఒక మిస్టీరియస్ మెసేజ్ కనిపిస్తుంది. అందులో ‘మాఫియా గేమ్’ ఒకటి మొదలవుతుందని చూపిస్తుంది. ఈ గేమ్‌లో సిటిజన్స్, మాఫియా, పోలీస్,డాక్టర్ వంటి పాత్రలను విద్యార్థులు వేయాల్సి ఉంటుంది. గేమ్ రూల్స్ ప్రకారం ప్రతి రోజు ఒకరిని ‘మాఫియా’ గా ఓటు వేసి ఎలిమినేట్ చేయాలి. రాత్రి సమయంలో ఆ వ్యక్తిని, ఒక సిటిజన్‌ను రహస్యంగా చంపుతాడు.
మొదట్లో ఈ గేమ్ ప్రమాదం కాదని అనుకుంటారు. అయితే ఈ గేమ్ కేవలం ఆట కాదని, నిజంగా ప్రాణాంతకమైనదని త్వరలో తెలుస్తుంది. ఓటు వేయబడిన విద్యార్థులు భయంకరమైన రీతిలో చనిపోతుంటారు. విచిత్రంగా రాత్రి సమయంలో అందరూ అపస్మారక స్థితిలో నిద్రపోతారు. ఆ తరువాతే ఓటు పొందిన వ్యక్తులు దారుణంగా చనిపోతూ ఉంటారు. లీ యూన్ అనే ఒక తెలివైన అమ్మాయి, కిమ్ అనే క్లాస్ లీడర్, ఈ గేమ్‌ను ఆపడానికి, మాఫియాను గుర్తించడానికి ఒక ప్లాన్ వేస్తారు. చివరికి ఈ గేమ్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఎవరు దీనిని నడిపిస్తున్నారు ? అందులో నుంచి విద్యార్థులు బయటపడతారా ? అక్కడి నుంచి బయట పడటానికి వీళ్ళు వేసే ప్లాన్ ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : కంటి ఆపరేషన్ కి కన్నింగ్ ప్లాన్… ఈ మర్డర్ కేసు మామూలుగా లేదు సామి
రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్
ఈ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘నైట్ హాస్ కమ్’ (Night Has Come). 2023 లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి లిమ్ డే-వూంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో లీ జే-ఇన్, కిమ్ వూ-సియోక్, చోయ్ యే-బిన్, చా వూ-మిన్, అహ్న్ జీ హో వంటినటులు నటించారు. ఇది 12 ఎపిసోడ్స్ తో 2023 డిసెంబర్ 4 న విడుదలైంది. ప్రతీ ఎపిసోడ్ ఆరాగంటకు పైగా ఉంటుంది. యూఇల్ హై స్కూల్‌లోని విద్యార్థుల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix), వికీ (Viki) ఓటీటీలలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది .