Viral News: సాధారణంగా ఆటోల వెనుక కొన్ని కొటేషన్స్ చూస్తూ ఉంటాం. ఆ కొటేషన్స్ ద్వార నీతి చెప్పే వారు కొందరైతే, వాటి ద్వార ద్వంద అర్థాలు వచ్చేలా రాసే వారు కొందరు ఉంటారు. కానీ చాలా వరకు ఆటో వెనుక వైపున రాసే కోటేషన్స్ ఇట్టే ప్రజలను ఆకర్షిస్తాయని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఆటోవాలాలు కూడ సమాజంలో జరిగే కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని కొటేషన్స్ రాస్తున్నారు. అలాంటిదే ఇది. ప్రస్తుతం ఈ ఆటో వెనుక ఉన్న కొటేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఇది నిజమంటూ ఆ ఆటోవాలాను తెగ అభినందిస్తున్నారు. ఇంతకు ఆ ఆటోవాలా తన ఆటో వెనక రాసిన కొటేషన్ ఏమిటో తెలుసుకుందాం.
ఆటోవాలాలకు, వారి కుటుంబాలకు పట్టెడన్నం తినిపించే ఆటోలంటే వారికి ప్రాణం. తమ కడుపు నింపుతున్న ఆటోల అందాన్ని పెంచేందుకు ఆటోవాలాలు తెగ ఆరాట పడుతుంటారు. అలా ఆటోవాలాల ఆరాటంలో పుట్టుకొచ్చిందే ఆటో వెనుక కొటేషన్స్ రాయడం. కొందరు నెమ్మదిగా రండి, హెల్మెట్ ధరించండి, దేశ భాషలందు తెలుగు లెస్స, నిదానంగా రమ్ము అంటూ ఆటో వెనుక రాస్తూ ఉంటారు.
మరికొందరు కాస్త మాస్ ఆలోచనలతో రాయిస్తారు. మరికొందరు తమకు వచ్చిన నూతన ఆలోచనలతో నీతి చెప్పే రీతిలో స్టిక్కర్స్ వేయిస్తారు. ఇటీవల ఆటోవాలాలు కొందరు సమాజంలో జరిగే కొన్ని ఘటనలను ఉదహరిస్తూ.. కొటేషన్స్ రాయిస్తూ.. ఔరా అనిపిస్తున్నారు. ఎందుకంటే సమాజంలో జరిగే ఘటనలపై కొటేషన్స్ రాస్తే ప్రజలు ఆకర్షితులవుతారన్నది ఆటోవాలాల అభిప్రాయం కావచ్చు.
అయితే ఆటో వెనుక ఉన్న కొటేషన్స్ చూసి, ఆ ఆటోవాలా గుణాన్ని కూడ అంచనా వేయవచ్చని అంటున్నారు ప్రయాణికులు. ఏదిఏమైనా ఓ ఆటోవాలా ఇటీవల తన ఆటోపై ఓ కొటేషన్ రాయించగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆటోవాలా ఏం రాశారంటే.. కూతురి బట్టల కోసం.. తన బట్టలు చింపుకున్నాడు ఓ తండ్రి.. ప్రేమ అనే పేరుతో తండ్రిని ప్రియుడి ముందు ఉంచి.. తండ్రి బట్టలు చించేసింది ఆ కూతురు అంటూ కొటేషన్ రాయించాడు.
Also Read: TTD News: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భావోద్వేగం.. అసలేం జరిగిందంటే?
ఆటో డ్రైవరన్న ఇలా రాయించిన ఉద్దేశం ఏమో కానీ, ఇప్పుడు వైరల్ అవుతోంది. సమాజంలో జరిగే ఘటనలు అద్దం పట్టేలా ఏం కొటేషన్ రాశావన్న.. డ్రైవరన్న అంటూ నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆటో వెనుక రాసిన విధంగా అందరినీ తప్పుబట్టే పరిస్థితులు లేవని, కొందరు తండ్రి ప్రేమను అర్థం చేసుకొని దేశం గర్వించదగ్గ స్థాయిలో ఎందరో కుమార్తెలు ఉన్నారని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రేమించినా, పెద్దల దృష్టికి తీసుకువచ్చి వారి ప్రేమను పెళ్లిగా మార్చుకొని ఆనందకర జీవితం సాగించే వారు ఎందరో ఉన్నారని కూడ ఈ ఆటో కొటేషన్ కి రిప్లై ఇస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఆటో డ్రైవరన్న ఎక్కడి వారో కానీ, ఒక్క కొటేషన్ తో తెగ వైరల్ అయ్యారు.