Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఈ విషయాన్నీ స్వయంగా జనసేన అధికార సోషల్ మీడియా హ్యాండిల్ లోనే తెలిపారు. “రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధపెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చు” అని రాసుకొచ్చారు.
ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుంచో పవన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇక ఆ నొప్పికి కారణం స్పాండిలైటిస్ అనే వ్యాధి అని తెలుస్తుంది. దీంతో అది అసలు ఎలాంటి వ్యాధి.. దేనివలన వస్తుంది.. ? దాని లక్షణాలు ఏంటి.. ? అని నెటిజన్స్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్ లో అరుదైన వ్యాధి. మహిళల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుంది. రోజు జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వలన ఈ వ్యాధి వస్తుంది. మెడ నుంచి వెన్నుముక వరకు ఉండే డిస్కుల్లో కొన్ని నరాలు ఉంటాయి. వాటి మధ్య ఎక్కువ ఒత్తిడి పడినా.. లేక ఎక్కువ సమయం రెస్ట్ లేకుండా పనిచేసినా లోపల నరాలు ఒత్తిడికి గురై విపరీతమైన వెన్ను నొప్పి వస్తుంది.
వెన్ను నొప్పితో పాటు మెడ లాగేస్తున్నట్లు అనిపిస్తుంది. కనీసం మెడను పక్కకు కూడా తిప్పనివ్వదు. ఇక అంత విపరీతమైన మెడనొప్పి వచ్చినప్పుడు తల తిరగడం, కళ్లు తిరిగి పడిపోవడం, నడుస్తున్నప్పడు ముందుకు తూలుతున్నట్లు అనిపించడం జరుగుతుంది. వీటితో పాటు వాంతులు, వికారం, జ్వరం.. ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవడం లాంటివి కనిపిస్తాయి.
3BHK Movie: ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కల.. సిద్దార్థ్ పట్టావయ్యా ఇంకో మంచి కథ
ఇక ఈ వ్యాధి ఎక్కువగా ముదిరితే పక్షవాతం వచ్చే ప్రమాదముందని వైద్యులు తెలుపుతున్నారు. మెడ నుంచి చేతికి సంబంధించిన కండరాల వరకు పాకి, లోపల నరాలు కృశించి చేతికి స్పర్శ లేకుండా చేస్తాయట. దీనివలన రక్తసరఫరకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్కువ అలసిపోవడం, గుండె, ఊపిరితిత్తులు మరియు కళ్ళకు కూడా పాకే అవకాశం ఉంది. ఇక ఈ వ్యాధికి చికిత్స ఉందా అంటే పూర్తిగా నయమయ్యే చికిత్స లేదు కానీ.. తాత్కాలికంగా టాబ్లెట్స్ తో నయం చేయవచ్చు.
యాంటీ-రుమాటిక్ మందులు వాడడం, కండరాలు బలంగా అవ్వడానికి కొద్దిగా వ్యాయామాలు చేయడం లాంటివి చేస్తే కొంత ఉపశమనం ఉంటుంది. ఇక ఈ వార్త తెలియడంతోనే పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం పవన్ రెస్ట్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన రికవరీ అయ్యి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కామెంట్స్ పెడుతూన్నారు.
ఇకపోతే పవన్ ఒకపక్క డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూనే.. తాను ఒప్పుకున్న సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు. మరి ఈ సినిమాలతో పవన్ ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.