E-Paper
Advertisement

Petrol Pump Fraud: రూ.100, రూ.110కు పెట్రోల్ కొట్టిస్తే ఏమవుతుంది? మోసపోకూడదంటే ఏ రూల్ పాటించాలి?

Petrol Pump Fraud: రూ.100, రూ.110కు పెట్రోల్ కొట్టిస్తే ఏమవుతుంది? మోసపోకూడదంటే ఏ రూల్ పాటించాలి?
Advertisement

సాధారణంగా కొందరు రూ.100, రూ.200తో పెట్రోల్ కొట్టించుకుంటారు. అలా రౌండ్ ఫిగర్‌తో పెట్రోల్ కొట్టించుకుంటే మోసపోతారని, రూ. 110..  210.. 310లకు పెట్రోల్ కొట్టించుకోవడం కరెక్టు అని, దీని వల్ల మోసాలకు అవకాశం ఉండదని భావిస్తారు. కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదంటున్నారు పెట్రోల్ బంక్ సిబ్బంది. తాజాగా ఓ పెట్రోల్ పంప్ అటెండెంట్ ఇంధనం సరిగ్గా పోస్తున్నారో? లేదో? తెలుసుకునేందుకు రెండు టిప్స్ చెప్తూ ఓ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అలా చేస్తే నో యూజ్!

నిజానికి పెట్రోల్ నింపే సమయంలో చాలా మంది వాహనదారులు అనుమానపడతారు. ఎక్కడ ఎలా మోసం చేస్తారోననే డౌట్ ఉంటుంది. తాజాగా ఎలాంటి అనుమానాలు లేకుండా పెట్రోల్ ఎలా కొట్టించుకోవాలో చెప్తూ ఓ వీడియో విడుదల చేశాడు పెట్రోల్ బంక్ లో పని చేసే ఓ వ్యక్తి.  కొంతమంది, పెట్రోల్, డీజిల్ నింపేటప్పుడు తెలివిగా రూ. 110, రూ. 210 కొట్టించుకుంటారు. అలా చేయడం వల్ల పెట్రోల్ పంప్ మోసం చేయకుండా కాపాడుకోవచ్చనుకుంటారు. అలా చేయడం వల్ల ఒరిగేదేమీ లేదంటున్నారు ఆయన. పెట్రోల్ పోయించుకునేటప్పుడు రెండు విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలంటున్నారు.

పెట్రోల్ బంకుల్లో మోసపోకుండా ఉండాలంటే..

Advertisement

పెట్రోల్ బంకుల్లో మోసాలు జరగకుండా ఉండేందుకు రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి డెన్సిటీ, రెండు పెట్రోల్ మెషీన్ రీడింగ్ కరెక్ట్ గా ఉన్నాయో? లేవో? చూడాలంటున్నాడు పెట్రోల్ పంప్ అటెండెంట్ . “పెట్రోల్ నింపేటప్పుడు ఈ రెండు విషయాలను గుర్తుంచుకోండి. ఈ రెండు కరెక్ట్ గా ఉంటే మోసపోయే అవకాశం ఉండదు. మీరు చేయవలసిన మొదటి విషయం మెషీన్ మీద డెన్సిటీని చెక్ చేయాలి. పెట్రోల్ కు 720- 775 మధ్య ఉండాలి. డీజిల్ డెన్సిటీ 820 నుంచి 860 వరకు ఉండాలి. ఈ డెన్సిటీ కరెక్ట్ గా ఉంటే ఫ్యూయెల్ స్వచ్చంగా ఉందని అర్థం. అలా ఉన్న బంక్ లోనే పెట్రోల్ పోయించుకోవాలి. చాలా మంది ప్యూయెల్ నింపే ముందు జీరోను చూస్తారు. కానీ, జీరో తర్వాత 2, 3, 4, 5 రావాలి. కానీ కొన్ని బంకుల్లో 0 నుంచి నేరుగా 10, 12, 15కు వెళ్తుంది. అలా వెళ్తే పెట్రోల్ పోసే మిషన్ ట్యాంపర్ చేసిందని అర్థం చేసుకోవాలి. అక్కడ పెట్రోల్, డీజిల్ తక్కువగా నింపే అవకాశం ఉంటుంది. ఈ రెండు విషయాలను జాగ్రత్తగా గమనించాలి. అంతేగానీ, రూ.210-310 పెట్రోల్ నింపడం వల్ల ఎలాంటి లాభం ఉండదు” అని పెట్రోల్ పంప్ అటెండెంట్ వివరించారు.

Advertisement

Read Also: రాంగ్ రూట్ లో వచ్చి.. ఆటోను ఢీకొట్టి అడ్డగోలు వాదన, కిలో మీటరు మేర ట్రాఫిక్ జామ్!

సోషల్ మీడియాలో వీడియో వైరల్

పెట్రోల్ పంప్ అటెండెంట్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 15.8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 700,000 కంటే ఎక్కువ లైక్‌లు సాధించింది. అటు ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి వీడియోల ద్వారా వినియోగదారులలలో అవేర్నెస్ తీసుకురావాలని కోరుతున్నారు.

Read Also: వర్కర్ ను బట్టలిప్పించి కొట్టిన రెస్టారెంట్ ఓనర్.. నెట్టింట వీడియో వైరల్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×