E-Paper
Advertisement

Viral Video: రాంగ్ రూట్ లో వచ్చి.. ఆటోను ఢీకొట్టి అడ్డగోలు వాదన, కిలో మీటరు మేర ట్రాఫిక్ జామ్!

Viral Video: రాంగ్ రూట్ లో వచ్చి.. ఆటోను ఢీకొట్టి అడ్డగోలు వాదన, కిలో మీటరు మేర ట్రాఫిక్ జామ్!
Advertisement

బెంగళూరు ట్రాఫిక్ లొల్లి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం కిక్కిరిసిన రోడ్లతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడటం కామన్. తాజాగా ఓ మహిళ ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. పైగా ఆటో డ్రైవర్ తోనే వాదనకు దిగించి, ట్రాఫిక్ పోలీస్ వచ్చి గొడవను ఆపేందుకు ప్రయత్నించినా, ఆమె అస్సలు తగ్గేదే లేదన్నట్లు రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు సదరు మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

బెంగళూరులోని బైయప్పనహళ్లి ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోలో టూ వీలర్ మీద ఉన్న ఓ మహిళ, ఎదురుగా వచ్చి ఓ ఆటోను ఢీకొట్టింది. పైగా ఆటో డ్రైవర్ మీద కేకలు వేయడం కనిపిస్తుంది. ఇంతలో ఓ ట్రాఫిక్ పోలీసు జోక్యం చేసుకుని ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ, ఆమె అస్సలు తగ్గకుండా ఆటో డ్రైవర్ మీద అరవడంతో పాటు దుర్భాషలాడింది. ఎదురుగా వచ్చి ఢీకొట్టి, మాట్లాడ్డం సరికాదని పోలీసు ఆమెకు చెప్పినా, అరుస్తూనే ఉంది. ఆటో డ్రైవర్ దే తప్పు అన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను కరెక్ట్ గానే వచ్చానని, ఆమే తన ఆటోను ఢీకొట్టిందని ఆటో డ్రైవర్ చెప్పేందుకు ప్రయత్నించాడు.

Advertisement

Read Also:  నా భార్యకు నా కంటే కుక్కలే ఇష్టం.. విడాకుల కోసం కోర్టుకెక్కిన భర్త!

కిలో మీటర్ మేర ట్రాఫిక్ జామ్

Advertisement

ఈ గొడవ కారణంగా సుమారు కిలో మీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరుకైన ఫ్లైఓవర్ దారిలో ఈ గొడవ మరింత ఇబ్బందికరంగా మార్చింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పంతా సదరు మహిళదే అంటున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నారు. “ఈ మహిళ ఆటోను ఢీకొట్టడంతో పాటు సదరు ఆటో డ్రైవర్ మీద అడ్డగోలుగా నోరుపారేసుకుంది. ఆమె కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవా” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “తప్పుడు రూట్ లో  బైక్ నడపడంతో పాటు అనవసర న్యూసెన్స్ కు పాల్పడిన సదరు మహిళ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానా విధించాలి” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ప్రతి ఒక్కరూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. కానీ, రోడ్డును చూడండి. డివైడర్ లేదు, పెయింట్ లేదు. డివైడర్ లైన్ కూడా లేదు. ఆమెది  రాంగ్ రూట్ అని ఎలా అంటారు?” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Read Also: రన్నింగ్ ఆటో మీద దూకి, అమ్మాయిని కాపాడిన హిందూ హీరో!

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×