E-Paper
Advertisement

Viral Video: వర్కర్ ను బట్టలిప్పించి కొట్టిన రెస్టారెంట్ ఓనర్.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: వర్కర్ ను బట్టలిప్పించి కొట్టిన రెస్టారెంట్ ఓనర్.. నెట్టింట వీడియో వైరల్!
Advertisement

మహారాష్ట్రలోని ఓ రెస్టారెంట్ లో ఉద్యోగిని కొట్టే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సదరు వర్కర్ బట్టలు విప్పించి మరీ పైపుతో కొడుతున్న విజువల్స్ ప్రతి ఒక్కరి మస్సును చివుక్కుమనిపిస్తున్నాయి. ఓనర్ కొడుతుంటే ఆ వర్కర్ కంటతడి పెట్టే దృశ్యం గుండెను పిండేస్తుంది. కొద్ది సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియో సోలాపూర్-పూణే జాతీయ రహదారిలోని హోటల్ 7777లో జరిగినట్లు తెలుస్తోంది. మరాఠీ న్యూస్ అవుట్‌ లెల్స్ ఈ ఘటనకు సంబంధించి గతంలోనే వార్తలు ప్రచురించాయి. కొద్ది నెలల తర్వాత మళ్లీ ఈ వీడియో వైరల్ అవుతున్నట్లు నెటిజన్లు చెప్తున్నారు.

ఈ వీడియోలో ఏం ఉందంటే?

నిమిషం లోపే ఉన్న ఈ వీడియోలో బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న రెస్టారెంట్ ఉద్యోగిని మధ్యలో నిలబెట్టారు. యూనిఫాంలో ఉన్న ఇతర ఉద్యోగులు, వెనుక వరుసలో నిలబడి ఉన్నారు. ఓ వ్యక్తి, బహుశ రెస్టారెంట్ ఓనర్ పైపుతో కార్మికుడిని కొడుతున్నట్లు అందులో కనిపించింది. “నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఏం చేసావు?” అంటూ సదరు వ్యక్తి మరాఠీలో మాట్లాడడ్డం కనిపిస్తుంది. దెబ్బలుతిన్న వ్యక్తి కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఆ తర్వాత అతడు పక్కకు వెళ్లిపోయాడు. మళ్లీ అతడిని వచ్చి నిల్చోవాలని సైగ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. పైపును పదే పదే నేల మీద కొడుతూ అతడి వైపు గుడ్లు ఉరిమి చూస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

Advertisement

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

అటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్కర్ ను దారుణంగా హింసించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను కొంత మంది మహారాష్ట్ర DGP అధికారిక ఎక్స్ అకౌంట్ కు ట్యాగ్ చేశారు. మరికొందరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ముంబై పోలీసులు, గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, బిజెపి మహారాష్ట్రకు కూడా ట్యాగ్ చేశారు. అటు ఈ వీడియోకు సంబంధించి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే, ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం వెయిట్ చేస్తున్నారు.  7777 రెస్టారెంట్ యజమాని లఖన్ హరిదాస్ మానేపై టెంబుర్ని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. అతడిని అరెస్ట్ కూడా చేసినట్లు తెలుస్తోంది.

రెస్టారెంట్ ఓనర్ ఏమన్నారంటే?

Advertisement

ఈ ఘటనపై ఇటీవల రెస్టారెంట్ యజమాని లఖన్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. నెలల క్రితం వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియోలో అప్పట్లో  దెబ్బలు తిన్న వర్కర్ కూడా ఉన్నాడు.  పాత ఘటనను ఇప్పుడు జరిగినట్లు చూపించడం బాధాకరం అన్నారు. అటు  ఈ వీడియోను చూసి నెటిజన్లు.. సదరు రెస్టారెంట్ ఓనర్..  తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: ఆటోను ఢీకొట్టి అడ్డగోలు వాదన, కిలో మీటరు మేర ట్రాఫిక్ జామ్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×