BigTV English
Advertisement

Sardar 2 : కార్తీ క్రేజీ సీక్వెల్ ‘సర్దార్ 2’ పేరుతో ఫ్రాడ్… స్పందించిన నిర్మాతలు

Sardar 2 : కార్తీ క్రేజీ సీక్వెల్ ‘సర్దార్ 2’ పేరుతో ఫ్రాడ్… స్పందించిన నిర్మాతలు

Sardar 2 : కోలీవుడ్ స్టార్ కార్తీ (Karthi) హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ (Sardar). ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్తీ అభిమానులను చేసే ప్రయత్నం చేసింది ‘సర్దార్ 2’ (Sardar 2) మూవీ నిర్మాణ సంస్థ. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను వదిలి, ‘సర్దార్ 2’ పేరుతో జరుగుతున్న ఫ్రాడ్ ను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పెషల్ నోటీస్ ని రిలీజ్ చేసి అసలు విషయాన్ని వెల్లడించింది ప్రిన్స్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ (Prince Pictures).


‘సర్దార్ 2’ పేరుతో ఫ్రాడ్

ఆ పోస్టులో “సర్దార్ 2 మూవీ విషయంలో ఫ్రాడ్ జరుగుతుందనే విషయం మా దృష్టికి వచ్చింది. కొంతమంది ప్రముఖ నటీనటులు, నటనపై ఆసక్తి ఉన్న పలువురు అప్కమింగ్ ఆర్టిస్టులకు ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తామని కొంతమంది మోసగాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారట. అయితే వాళ్ళు సినిమాలో నటించాలంటే డబ్బులు కట్టాలని డిమాండ్ చేయడంతో పాటు, ఇతర ఫేవర్స్ కూడా అడుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వెంటనే మేము ఈ విషయంపై లీగల్ చర్యలు మొదలు పెట్టాము. అలాగే క్రిమినల్ కంప్లైంట్ కూడా నమోదు చేశాము.


ఈ విషయంపై మేము మూవీ లవర్స్ అందరికీ ఒక అవగాహన కల్పించాలనే ఆలోచనతో నోటీసును విడుదల చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా మా సినిమా పేరును వాడుకుని, అవకాశాల పేరుతో అనుమానస్పదంగా మాట్లాడినా, కలిసినా మా ప్రొడక్షన్ హెడ్ ను సంప్రదించండి” అంటూ ఓ నెంబర్ ని షేర్ చేశారు.

గతంలోనూ ఇలాంటి సంఘటనే…

గతంలోనూ ప్రిన్స్ అనే ఈ నిర్మాణ సంస్థ తమ నిర్మాణ సంస్థ పేరును తప్పుగా వాడుకుంటూ, నటీనటులకు అవకాశాల పేరుతో కలవమని ఫోన్లు చేస్తున్నారని ఇలాగే సోషల్ మీడియాలో ఓ నోటీసును రిలీజ్ చేసింది. 2024 ఫిబ్రవరిలో ఆ పోస్ట్ ని ప్రిన్స్ నిర్మాణ సంస్థ రిలీజ్ చేయగా, అందులో “అఫీషియల్ ఛానల్ ద్వారానే మేము అవకాశాల కోసం కమ్యూనికేట్ అవుతాము. థర్డ్ పార్టీ లేదా తెలియని వ్యక్తుల ద్వారా ఇలాంటి ఆఫర్లు ఇవ్వము” అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఇదే సంస్థ ‘సర్దార్ 2’ సినిమా పేరుతో కొంతమంది ఫ్రాడ్స్ జనాలను మోసం చేస్తున్నారంటూ జనాల దృష్టికి తీసుకురావడం గమనార్హం.

ఇదిలా ఉండగా 2022లో రిలీజ్ అయిన ‘సర్దార్’ మూవీ 100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. కార్తి హీరోగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీకి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఇందులోకి కార్తీ రా ఏజెంట్ గా, పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకున్నారు. ఫస్ట్ పార్ట్ లో రాశి ఖన్నా, లైలా, చుంకీ పాండే ప్రధాన పాత్రలు పోషించగా, ఇప్పుడు సీక్వెల్ కి రంగం సిద్ధమవుతోంది. సీక్వెల్లో కార్తీ, ఎస్జె సూర్య, మాళవిక మోహనన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కొంతకాలం క్రితం ఈ సినిమా సెట్స్ లోనే ఓ స్టంట్ మాన్ చనిపోయిన సంగతి తెలిసిందే.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×