Aishwarya Rai: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) తాజాగా తన భర్తకి బర్త్డే సందర్భంగా విషెస్ లేటుగా తెలియజేయడంతో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అయితే బర్త్డే విషెస్ చెప్పడంలో ఐశ్వర్య ఎందుకు ఆలస్యం చేసింది..ఇంతకీ ఐశ్వర్య భర్తకు ఏ విధంగా విషెస్ తెలియజేసిందో ఇప్పుడు చూద్దాం.. ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ల వైవాహిక బంధం ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగుతోంది అని బయటకు వినిపిస్తున్న టాక్. కానీ ఈ జంట మాత్రం ఎప్పటికప్పుడు కలిసిమెలిసి కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక బాలీవుడ్ మీడియాలో వినిపించే వార్తలకు, వాళ్లు ప్రవర్తించే తీరుకి అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. ఎందుకంటే చాలా రోజుల నుండి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వీరి విడాకుల వార్తలు వినిపించిన ప్రతిసారి ఈ జంట కలిసి కనిపించి వారందరినీ షాక్ కి గురి చేస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా తన కూతురుకి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ లు వార్తల్లో నిలిచారు.
కూతురి కోసం కోర్టు మెట్లు ఎక్కిన అభిషేక్ – ఐశ్వర్య..
తన కూతురు ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan) కి సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ తప్పుగా వార్తలు రాసి తమ కూతురు ఇక లేదు అని తప్పుడు వార్తలు క్రియేట్ చేయడంతో మండిపడిన అభిషేక్ బచ్చన్ వెంటనే కోర్టుని ఆశ్రయించారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) తన 49వ బర్త్డేని గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక కొడుకు బర్త్డే రోజు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఒక స్పెషల్ పోస్టు పెట్టి కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే సెలబ్రిటీల బర్త్డేలకు, మ్యారేజ్ డే లకు కచ్చితంగా వాళ్ల పార్ట్నర్స్ ఏం పోస్ట్ పెట్టారో తెలుసుకోవాలని చాలా మందిలో ఆత్రుత ఉంటుంది. అలా అభిషేక్ బచ్చన్ బర్త్డే రోజు ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) ఎలాంటి పోస్ట్ పెడుతుంది.. ? భర్తకు ఏ విధంగా విషెస్ తెలియజేస్తుంది? అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అభిషేక్ బర్త్ డే రోజు అభిమానులను నిరాశపరిచింది ఐశ్వర్య రాయ్.
ఆలస్యంగా భర్తకు బర్త్ డే విషెస్ తెలియజేసిన ఐశ్వర్య..
ఎందుకంటే అభిషేక్ బర్త్డే కి ఐశ్వర్య రాయ్ చాలా ఆలస్యంగా పోస్ట్ పెట్టడంతో చాలామంది అసహనానికి గురయ్యారు. అయితే లేట్ అయినా లేటెస్ట్ గా పోస్ట్ పెట్టింది ఐశ్వర్య రాయ్.తన భర్తకు సంబంధించిన చిన్ననాటి ఫోటో షేర్ చేసి.. “మీరు ఎల్లప్పుడూ ప్రేమతో, ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ ఐశ్వర్య రాయ్ పోస్ట్ పెట్టింది. అయితే ఎట్టకేలకు భర్తకి సంబంధించి బర్త్డే పోస్ట్ పెట్టడంతో అభిమానులైతే హ్యాపీ అయ్యారు. కానీ భర్త బర్త్డే విషయంలో పోస్ట్ కాస్త లేట్ అయ్యేసరికి అభిమానులు అసహనంగా ఫీల్ అయ్యారు. ఇక మరి కొంతమందేమో భర్త పుట్టినరోజుకి కూడా విష్ చేయలేనంత బిజీగా ఉందా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. కానీ సెలబ్రిటీలు ఎంత బిజీ లైఫ్ ని లీడ్ చేస్తారో చెప్పనక్కర్లేదు. అలా బిజీ పనుల్లో పడి కొన్ని కొన్ని సార్లు ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేస్తూ ఉంటారు. వాటన్నింటినీ భూతద్దం పెట్టి చూస్తే తప్పులే కనిపిస్తాయి అంటూ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai ) అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పప్పటికీ అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) బర్త్ డే కి లేట్ అయినా సరే ఐశ్వర్య పోస్ట్ పెట్టింది. లేకపోతే మళ్లీ ఐశ్వర్య, అభిషేక్ ల విడాకుల రూమర్లు తెరమీద వినిపించేవి అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.