BigTV English

Dog Fight Jail Term: కుక్కలతో ఆ పని చేసినందుకు దోషికి 475 ఏళ్ల జైలు.. ఎంత క్రూరంగా చేసేవాడంటే

Dog Fight Jail Term: కుక్కలతో ఆ పని చేసినందుకు దోషికి 475 ఏళ్ల జైలు.. ఎంత క్రూరంగా చేసేవాడంటే

Dog Fight Jail Term| జంతు హింసను ఒక నేరం. భారతదేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి నేరాలకు కఠిన చట్టాలున్నాయి. అయితే భారతదేశంలో మాత్రం ఈ చట్టాలు సరిగా అమలు కావడం లేదు కానీ అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో మాత్రం జంతు హింసను చాలా సీరియస్ గా పరిగణిస్తారు. తాజాగా అమెరికాలో ఒక వ్యక్తిని చాలా కాలంగా తన కుక్కలను విపరీతంగా హింసించినందుకు స్థానిక కోర్టు అతనికి దాదాపు 500 ఏళ్ల జైలు శిక్ష విధించింది.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన విన్సెంట్ లీమార్క్ బర్రెల్ అనే 57 ఏళ్ల వ్యక్తిని రెండేళ్ల క్రితం పౌల్డింగ్ కౌంటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు కుక్కలను బిజినెస్ కోసం పెంచేవాడు. అయితే పెంపుడు జంతువులలా కాదు.. క్రూర మృగాల లాగ. వాటిని ప్రేరేపించి ఒక దానితో ఒకటి తలపడే టట్లు చేసేవాడు. ఈ క్రమంలో చాలా కుక్కలు చనిపోయాయి. అలా శిక్షణ ఇచ్చాక వాటితో కోళ్ల పందేల లెక్క డాగ్ ఫైట్లు చేయించేవాడు. అవి చూడడానికి చాలా మంది వచ్చి పందెం కాసేవారు. ఇలా చాలాకాలంగా చట్ట వ్యతిరేకంగా అతను పోటీలు నిర్వహిస్తూ 95 కుక్కల మరణానికి కారణమయ్యాడు. ఈ విషయం పోలీసులకు ఇటీవల తెలిసి బర్రెల్ ని అరెస్ట్ చేశారు.

అతడి ఫార్మ్ హౌస్ నుంచి కుక్కలను స్వాధీనం చేసుకొని అనిమల్ కంట్రోల్ కు తరలించారు. బర్రెల్ ని కోర్టులో ప్రవేశపెట్టగా.. రెండేళ్ల పాటు కేసు విచారణ జరిగింది. తాజాగా న్యాయమూర్తి.. జంతు హింస చట్టం కింద ఒక్కో కుక్క మరణానికి గాను 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అంటే మొత్తం 95 క్కుక్కలు చనిపోయేందుకు కారణమయ్యాడు కాబట్టి మొత్తం 475 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి. అయితే లీమార్క్ బర్రెట్ డేవిడ్ హీత్ మాట్లాడుతూ తాము పై కోర్టులో అప్పీల్ చేస్తామని.. ఈ కేసులో ఆధారాలను న్యాయమూర్తి సరిగా పరిగణలోకి తీసుకోలేదని చెప్పాడు.


రూ.2500 కోట్ల ఆస్తుల వారసుడికి యావజ్జీవ కారాగార శిక్ష!

కోట్ల విలువైన ఆస్తులున్న ఓ బ్రిటన్ యువకుడు తన ప్రాణ స్నేహితుడిని హత్య చేసినందుకు స్థానిక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అత్యంత దారుణంగా, ఆటవికంగా ఈ హత్య జరిగిందని కోర్టు పేర్కొంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, నిందితుడు డిలన్ థామస్ (24), తన ప్రాణ స్నేహితుడు విలియమ్ బుష్‌ను 2023 డిసెంబర్ 24న కత్తులతో ఏకంగా 37 సార్లు పొడిచి హత్య చేశాడు. హత్యకు కొన్ని గంటల ముందు అతడు మెడ నిర్మాణం గురించి, సున్నితమైన ప్రాంతాల గురించి నెట్టింట వెతికాడు. అయితే, తనకు ఎటువంటి దురుద్దేశం లేదని నిందితుడు కోర్టులో పేర్కొన్నాడు.

థామస్ తాతా సర్ స్టాన్లీ థామస్ ప్రముఖ పీటర్స్ పై అనే ఫుడ్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తరువాత 1987లో దాన్ని మరో సంస్థకు విక్రయించి భారీగా లాభపడ్డాడు. అలా సంపాదించిన ఆస్తి ప్రస్తుతం థామస్‌కు సంక్రమించింది. అతడి సంపద విలువ రూ.2500 కోట్లు.

ఇదెలా ఉంటే, హత్యకు కొంత కాలం ముందు నుంచే థామస్ మానసిక స్థితి దిగజారుతూ వచ్చిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ హత్యను ముందస్తుగానే ప్లాన్ చేశాడని, తన చర్యలపై అతడికి పూర్తి అవగాహన ఉందని వాదించారు. హత్యకు కొన్ని వారాల మునుపు అతడు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ కంచెను దాటే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం బెయిలుపై విడుదలయ్యారు.

ఇక ఘటన జరిగిన రోజు థామస్‌ను అతడి బామ్మ కారులో తీసుకొచ్చి అతడి ఇంటి ముందు దిగబెట్టింది. ఆ సమయంలో విలియం ఇంట్లోనే ఉన్నాడు. కొన్నాళ్లుగా వాళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లోకి వెళ్లిన థామస్ కిచెన్‌లో ఉన్న రెండు కత్తులు తీసుకుని విలియం ఉన్న బెడ్ రూం లోకి వెళ్లాడు. నిద్రిస్తున్న అతడిపై ఒక్కసారిగా దాడి చేశాడు. కత్తులతో ఇష్టారీతిన పొడిచాడు. బాధితుడి ఆర్తనాదాలు రోడ్డున పోయే వారికి వినిపించాయి. ఇక హత్య అనంతరం థామస్ పోలీసులకు కాల్ చేసి జరిగిన దారుణం గురించి వివరించారు.

ఇది అత్యంత పాశవికంగా జరిగిన హత్య అని న్యాయమూర్తి విచారణ సందర్భంగా పేర్కొన్నారు. మృతుడి సోదరి కోర్టులోనే కన్నీరు మున్నీరైంది. తమ జీవితాలు తలకిందులయ్యాయని విలియం తండ్రి వాపోయారు. తమ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నామని, అవన్నీ కుప్ప కూలిపోయాయని మృతుడి గర్ల్‌ఫ్రెండ్ పేర్కొన్నారు.

తన స్నేహితుడిని అంతమొందించేందుకు ముందస్తు పథకం ఏదీ పన్న లేదని నిందితుడు చెప్పుకొచ్చాడు. అయితే, తన మానసిక స్థితి దిగజారుతున్నా వైద్య సాయం తీసుకోలేదని, ఇందుకు తాను విచారపడుతున్నానని అన్నాు. కాగా, అరెస్టు తరువాత నిందితుడు తనని తాను జీసస్ అని చెప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. తమకు దేవుడి వద్ద ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా నిందితుడు తెలిపినట్టు పేర్కొన్నారు.

థామస్ తాత 1950ల్లో ఆహార సంస్థను ఏర్పాటు చేశారు. అనంతరం, 1988లో దాన్ని పీటర్స్ ఫుడ్ అనే సంస్థకు విక్రయించి భారీగా ఆస్తి సొమ్ము సొంతం చేసుకున్నారు.

Related News

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Delhi News: పట్టపగలు దోపిడీ.. కోటి ఆభరణాలు చోరీ, ఢిల్లీలో దొంగల బీభత్సం

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Big Stories

×