BigTV English

Barrelakka Marraige: రెండో పెళ్లి చేసుకున్న బర్రెలక్క.. నెట్టింట ఫోటోలు, వీడియోలు వైరల్

Barrelakka Marraige: రెండో పెళ్లి చేసుకున్న బర్రెలక్క.. నెట్టింట ఫోటోలు, వీడియోలు వైరల్
Barrelakka Marraige
Barrelakka Marraige

Barrelakka Marraige: ప్రస్తుతం యువతలో సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పని చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫేమస్ అయిపోతుంటారు. తాము చేసే పని ఎటువంటిది అనే మోహమాటం లేకుండా నెట్టింట పోస్టులు పెడుతూ ప్రపంచానికి తమను తాము పరిచయం చేసుకుంటుంటారు. అందులో చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నా.. మనకు తెలిసిన ఫేమస్ వ్యక్తుల్లో బర్రెలక్క అలియాస్ శిరీష ఒకరు. బర్రెలను కాస్తూ తాను చేసే వీడియోలతో ఫేమస్ అయిన బర్రెలక్క.. ఇటీవల ఎన్నికల్లో కూడా పోటీ చేసి తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలతోను ప్రశంసలు అందుకుంది. పలువురు అగ్ర నాయకుల నోట కూడా బర్రెలక్క పేరు రావడంతో మరింత ఫేమస్ అయింది. కానీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయిన విషయం తెలిసిందే.


సోషల్ మీడియా ఫేమ్ బర్రెలక్క తాజాగా వివాహబందంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే తన పెళ్లికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు, ప్రీ వెడ్డింగ్ వీడియోలను కూడా సోషల్ మీడియాలోని తన ఫాలోవర్లతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేడు ఆమె పెళ్లి చేసుకుంది. ఈ మేరకు బర్రెలక్క పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: మా పిల్లి ఎక్కడో తప్పి పోయింది.. కనిపిస్తే చెప్పండి ప్లీజ్.. ఊరంతా పోస్టర్లు


బర్రెలక్క నేడు రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పటికే గతంలో తాను ఒకరిని వివాహం చేసుకున్నా సఖ్యత లేక విడిపోయినట్లు తానే స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. తన బంధువు వెంకటేష్ తో కలిసి ఏడడుగులు వేసింది. నాగర్ కర్నూల్ లోని పెద్దకొత్తపల్లిలోని పీఎంఆర్ గార్డెన్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. తన స్నేహితులు, బంధువుల మధ్య ఈ పెళ్లి తంతువు పూర్తి చేసుకుంది.

barrelakka
barrelakka

సంప్రదాయ పద్ధతిలో జరిగిన బర్రెలక్క పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా, నిన్న జరిగిన హల్దీ వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను కూడా బర్రెలక్క సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 

Related News

Ganesh Utsav Viral Video: గణపయ్య నిమజ్జనం.. వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి.. వీడియో చూస్తే కన్నీళ్లు గ్యారంటీ!

Viral News: ఒక బీహెచ్‌కే ఫ్లాట్‌కి లక్ష ఇరవై వేలా… షాక్ లో నెటిజన్లు.. ఎక్కడో తెలుసా?

Viral Video: కదులుతున్న రైలుకు వేలాడేతూ డేంజర్ స్టంట్, పైగా అమ్మాయిని టచ్ చేస్తూ..

Hundi Chori: గుడిలో చోరీ.. ఆ తర్వాతి రోజే దొంగ ఇంట్లో ఊహించని ఘటన, దెబ్బకు డబ్బులు తిరిగిచ్చేశాడు!

Viral Video: భార్య కోరిక తీర్చనందుకు భర్తను కుమ్మేసింది.. చివరకు ఏం జరిగింది? వైరల్ వీడియో

Bird wedding festival: ఇక్కడ యువకులకు పెళ్లి నిల్.. పక్షులకు మాత్రం గ్యారెంటీ.. ఈ వెరైటీ కల్చర్ ఎందుకంటే?

Big Stories

×