Big Stories

Kia K4 Sedan : కియా నుంచి మరో సూపర్ స్టైలిష్ కారు

kia-k4-sedan
kia-k4-sedan

Kia K4 Sedan : కియా మోటార్స్.. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా కంపెనీ రికార్డుల మోత మోగించింది. ఏళ్ల తరబడి దేశంలో పాతుకుపోయిన కార్ల కంపెనీలకు చుక్కలు చూపింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీలకు గట్టిపోటీగా నిలిచింది. కియా బడ్జెట్ కార్ల నుంచి హైరేంజ్ కార్ల వరకు తయారుచేస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ కొత్త తరం సెడాన్ కార్ కే4ని మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిచింది. ఈ కారులో ఎలాంటి డిజైన్‌లో ఉండనుంది. కారులో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయి. తెలుసుకోండి.

- Advertisement -

కియా కె4 డిజైన్ విషయానికి వస్తే ఇది కూడా ఫ్యూచర్ కార్ల మాదిరిగానే ఉండనుంది. కారు షేప్ ప్రత్యేమైన ఆకృతిని కలిగిఉంది. కారుకు మంచి స్పోర్ట్ డిజైన్ ఇచ్చే నాలుగు డోర్లు ఉన్నాయి. కారు చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది. కె4 చూడటానికి మెర్సిడెస్-బెంజ్ CLS, ఆడి A7 మోడల్ ఆకారంలో ఉంది. విశాలవంతంమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. కాంపాక్ట్ సెడాన్ వేరియంట్లలో కియా కె4 అతిపెద్ద కారుగా నిలిస్తుంది. కారు మొత్తం పొడవు 185.4 అంగుళాలు, వెడల్పు 72.8 అంగుళాలు ఉంటుందని సంస్థ వెల్లడించింది. కారు ముందు భాగంలో కాన్స్టెలేషన్ లైట్లు ఉన్నాయి. అలానే వెనుక భాగంలో బంపర్ కింద ఒక రకమైన స్పోర్టి డిఫ్యూజర్ లభిస్తుంది.

- Advertisement -

Also Read : హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్

కారు లోపల భాగాన్ని చూసినట్లయితే సీట్లకు పెద్ద స్క్రీన్‌లు అమర్చారు. డ్రైవర్, ప్రయాణికుల మధ్య ఎక్కవ గ్యాప్ ఉంటుంది. డ్రైవర్ క్యాబిన్ మొత్తం నూతన టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. కారులో ప్రతి ప్రతి పరికరాన్ని డ్రైవర్ దగ్గర ఉండే మెయిన్ స్క్రీన్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. కారులో విసృతమైన సన్‌రూఫ్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి. ప్రీమియం హర్మాన్ కార్డాన్ ఆడియో అందుబాటులో ఉంటుంది. Apple CarPlay, Android Auto ప్రతి పార్ట్‌కు కనెక్ట్ అయి ఉంటాయి. కారు వెనుక భాగం క్యూబిక్ ఆకారంలో ఉంటుంది. డోర్‌లను అన్‌లాక్ చేయడానికి లేదా యాక్సెస్‌ను చేయడానికి NFC-అమర్చిన కార్డ్‌లు లేదా వర్చువల్ డిజిటల్ కీ 2.0 అందుబాటులో ఉంది.

Also Read : కియా సెల్టోస్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ లాంచ్!

కియా కొత్త తరం K4 సెడాన్ కారులో కంపెనీ L- ఆకారపు నిలువు LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్‌లను అమర్చింది. దీనికి డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, సి పిల్లర్‌పై వెనుక డోర్ హ్యాండిల్ ఇందులో ఇవ్వబడ్డాయి. కంపెనీ ఇంటీరియర్‌లో కూడా డ్యూయల్ టోన్‌ని ఉపయోగించింది. పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు వరుసకు సెంటర్ ఆర్మ్‌రెస్ట్, మెమరీ సీట్లు, పుష్ బటన్ స్టార్ట్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్లు వాహనంలో ఉన్నాయి. అయితే కారు అమెరికా మార్కెట్‌లోకి అందుబాటులో ఉంది. భారత్‌లోకి ఎప్పుడు రానుందనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News