Big Stories

Cat Missing: మా పిల్లి ఎక్కడో తప్పి పోయింది.. కనిపిస్తే చెప్పండి ప్లీజ్.. ఊరంతా పోస్టర్లు

Cat Missing
Cat Missing

Cat Missing: జంతువులను మనం ఎంత ప్రేమగా చూసుకుంటే అవి తిరిగి అంతే ప్రేమను మనపై చూపిస్తాయి. అయితే చాలా మందికి పెంపుడు జంతువులు, పక్షులు(పిల్లి, కుక్క, కుందేలు) వంటి వాటిని పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. వాటిని ఇంట్లో సభ్యులుగానే ఆదరిస్తుంటారు. ఈ తరుణంలో అవి మిస్సైనా లేక ప్రాణాలు కోల్పోయిన విలవిల్లాడిపోతుంటారు. అంతెందుకు చాలా మంది వారు పెంచుకునే జంతువుల బర్త్ డేలు గ్రాండ్ గా జరుపుకోవడం కూడా చూసిన సంఘటనలు ఉన్నాయి. ఓ వ్యక్తి అయితే ఏకంగా తన కుక్క జ్ఞాపకార్థంగా ఓ విగ్రహాన్నే కట్టించాడు. అయితే తాజాగా ఓ పెంపుడు పిల్లి మిస్సైందంటూ ఓ కుబుంబం చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

- Advertisement -

తాము పెంచుకునే పిల్లి మిస్సైందంటూ ఓ ఫ్యామిలీ ఏకంగా ఊరంతా ప్రకటనలు చేసింది. ఈ మేరకు వాల్ పోస్టర్లను అంటించింది. ప్రస్తుతం ఈ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా పొదిపిలో ఈ ఘటన వెలుగుచూసింది. తన పెంపుడు కుక్క తప్పింపోయింది అంటూ విశ్వనాధపురం కాలేజ్ రోడులో గురువారం పోస్టర్లు వెలుగుచూశాయి. పిల్లి ఆచూకి వెతికిస్తే భారీ పారితోషికం కూడా ఇస్తామని ప్రకటించారు. దీంతో పోస్టర్లు చూసిన స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

- Advertisement -

Also Read: రోడ్డుపై బైక్ నడుపుతూ ఆఫీసు జూమ్ మీటింగ్ కాల్.. ‘మా సాఫ్ట్‌వేర్ కష్టాలు మీకేం తెలుసు బ్రో’

ప్రైవేటు సంస్థలో ఏడాదికాలంగా మాథియో టీచర్ గా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో గత సంవత్సరకాలంగా ఓ పిల్లిని పెంచుకుంటున్నాడు. అయితే తాజాగా గురువారం తెల్లవారుజామున పిల్లి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. దీంతో మాథియో ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే పక్క ఇంట్లో, ఇరుగు పొరుగు వారి ఇళ్లలో మరియు వీధుల్లో తిరుగుతూ పిల్లి ఆచూకీ కోసం కనిపించిన ప్రతీ ఒక్కరిని అడగడం మొదలుపెట్టాడు. ఎంత తిరిగినా పిల్లి దొరకకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు.

నిద్రాహారాలు మాని పిల్లి కోసం వెతికినా దొరకకపోవడంతో వెంటనే పోస్టర్లు కొట్టించాడు. ‘పొదిలి విశ్వనాధపురం గీతాంజలి స్కూల్ వీధిలో పెంపుడు పిల్లి ఈరోజు 27(బుధవారం) ఉదయం నుండి కనబడుట లేదు. కావున పైన ఫోటోలో తెలిపిన పెంపుడు పిల్లి ఎవరికైనా కనపడినచో ఈ క్రింది నెంబర్ ను సంప్రదించగలరు. నెంబర్: 9866564450 ఆచైకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును’ అని పిల్లి ఫోటోను జత చేస్తూ పోస్టర్లను అంటించారు. దీంతో ప్రస్తుతం పోస్టర్లు నెట్టింట వైరల్ గా మారాయి. పాపం అతనికి పిల్లి దొరకాలని నెటిజన్లు ప్రార్థిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News