BigTV English

Vladimir Putin: ఎఫ్-16 విమానాలను కూల్చేస్తాం.. నాటో దేశాలకు పుతిన్ హెచ్చరిక..

Vladimir Putin: ఎఫ్-16 విమానాలను కూల్చేస్తాం.. నాటో దేశాలకు పుతిన్ హెచ్చరిక..

Vladimir Putin warns NATO CountriesVladimir Putin warns NATO Countries over Supply Of F-16 Jets To Ukraine: రష్యా అధ్యక్షుడు పుతిన్ నాటో దేశాలను హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్-16 విమానాలను అందజేస్తే మాత్రం వాటిని ఎట్టి పరిస్థితులో కూల్చి వేస్తామని స్పష్టం చేశారు.


బుధవారం ట్వెర్ రీజియన్‌లోని మిలిటరీ పైలట్‌లతో జరిగిన సమావేశంలో, పొరుగు దేశాలలోని ఎయిర్‌ఫీల్డ్‌ల నుంచి రష్యన్ దళాలకు వ్యతిరేకంగా F-16 లను ఉపయోగించే ఏదైనా ప్రయత్నం చేస్తే తమ దగ్గర సమాధానం ఉండదని హెచ్చరించారు.

ఇప్పటివరకు తాము యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, మల్టీ లాంఛ్ రాకెట్ వ్వవస్థలు సహా ఇతర పరికరాలను నాశనం చేసినట్లే F-16 విమానాలను కూడా కూల్చి వేస్తామని స్పష్టం చేశారు.


F-16 యుద్ధ విమానాలు అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పుతిన్ తెలిపారు.

బుధవారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా కొన్ని నెలల్లో F-16 విమానాలు తమ దేశానికి చేరుకోనున్నాయని తెలిపారు. డిమిట్రో కులేబా వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే పుతిన్ స్పందించడం గమనార్హం.

రష్యాతో రెండేళ్ళుగా ఎడతెగని సంఘర్షణలో నిమగ్నమైన ఉక్రెయిన్, దాని వైమానిక దళంలో చాలా భాగాన్ని కోల్పోయింది. US నుంచి F-16ల కొనుగోలును స్థిరంగా కొనసాగించారు.

Also Read: నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం లేదనుకోలేం.. కెనడా ప్రధాని ట్రూడో

బెల్జియం, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్‌తో సహా అనేక దేశాలు F-16లను విరాళంగా అందించడం ద్వారా తమ సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చాయి. అదనంగా, అధునాతన విమానాలను సమర్థవంతంగా ఆపరేట్ చేయడానికి ఉక్రేనియన్ పైలట్‌లకు శిక్షణ ఇవ్వడంలో దేశాల కూటమి సహాయం చేస్తుంది.

ఈ తరుణంలో పుతిన్ చేసిన హెచ్చరికలను నాటో దేశాలను ఏ మేరకు పట్టించుకుంటాయనేది వేచి చూడాల్సిందే.

Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×