E-Paper
Advertisement

Viral Video: దారుణం.. ప్రేమించలేదని నడి రోడ్డుపై యువతిపై దాడి చేసి బట్టలు..?

Viral Video: దారుణం.. ప్రేమించలేదని నడి రోడ్డుపై యువతిపై దాడి చేసి బట్టలు..?
Advertisement

Viral Video:  బెంగళూరులో పట్టపగలే చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన నగరాన్ని కలచివేసింది. నడ్డిరోడ్డుపై యువతిపై యువకుడు దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధిత యువతి, నవీన్ కుమార్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. ఈ క్రమంలో నవీన్ కుమార్ యువతికి ప్రేమను ప్రతిపాదించాడు. అయితే ఆమె ఆ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది.

తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో నవీన్ కుమార్ యువతిని తరచూ వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ వేధింపులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చాయి. తాజాగా యువతి హాస్టల్ సమీపంలో ఉన్న సమయంలో నవీన్ కుమార్ కారులో అక్కడికి వచ్చి దిగాడు. నడ్డిరోడ్డుపైనే ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తూ దాడికి దిగాడు. ఆమెను బెదిరించి దుస్తులు విప్పేందుకు యత్నించినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమెపై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Advertisement

అయితే యువతి ధైర్యంగా ప్రతిఘటించి అతని చెర నుంచి తప్పించుకోగలిగింది. చుట్టుపక్కల వారు స్పందించడంతో నవీన్ కుమార్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడున్నవారిలో ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వేగంగా వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నవీన్ కుమార్‌ను గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మహిళల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Advertisement

ALSO READ: Bhadradri District: అక్షరాల రూ.98లక్షల విలువైన గంజాయి.. కంటైనర్‌లో తీసుకెళ్తుండగా, పోలీసులు ఎంటర్..!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×