Viral Video: ఏదైనా పని చేసినప్పుడు, దానిపై పూర్తిగా నిఘా పెట్టాలి. లేకుంటే దానివల్ల జరిగే అనర్థాలు అన్నీఇన్నీ కావు. రీసెంట్‌గా బీహార్ రాజధాని పాట్నాలో నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌పై కనీసం నిఘా లేదు. చివరకు చిన్నారులు ప్లైఓవర్‌కు ఇరువైపులా ఉండే సేఫ్టీకి సంబంధించి ప్లేట్ల నట్లు, బోల్టులు తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోలో వైరల్ అయ్యింది.
పాట్నాలో జూన్ 11న మొదటి ఎలివేటెడ్ కారిడార్ లేదా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు. రాజధానిలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు ప్లాన్ చేయడం, ఓపెన్ చేయడం జరిగిపోయింది. అశోక రాజ్‌పథ్ కారిడార్‌లో నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బీహార్‌లో మొదటిది కూడా. రూ.422 కోట్లతో దీన్ని నిర్మించారు. కోట్లాది రూపాలతో ఖర్చు చేసిన నిర్మించిన ఈ వంతెనపై కనీసం నిఘా కూడా లేదు.
కొత్తగా ప్రారంభించబడిన వంతెనపై అటు ఇటు సేఫ్టీ కోసం పేట్లను నిర్మించారు. వాటిని సంబంధించి నట్లు- బోల్టులను తొలగిస్తున్నారు. నలుగురు చిన్నారుల గ్యాంగ్ వాటిని విప్పి అక్కడే ఉంచేశారు. అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి చిన్నారుల చేస్తున్న పనులపై ఫోన్ తో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడది గిరగిరా తిరిగేస్తోంది. పట్ట పగలు చిన్నారులు ఇలా చేయడాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే షూట్ చేస్తున్న వ్యక్తి చిన్నారులను గట్టిగా తిట్టడంతో అక్కడి నుంచి పారిపోయారు.
ఈ వీడియో నెటిజన్ల నుండి అనేక విషయాలను ప్రస్తావిస్తున్నారు. పిల్లలకు శిక్ష విధించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిని అస్సలు క్షమించరాదని మరికొందరు అంటున్నారు. నిజంగా ఎవరైనా దీన్ని తెరవగలరా? బాగా ఆలోచించి నిర్మించారని మరొక నెటిజన్ ప్రశ్నించాడు. కొందరైతే ఈ చిన్నారులు బంగ్లాదేశ్ మూలాలు కలిగినవారని అంటున్నారు. దీనికి సంబంధించి స్థానిక పరిపాలన విభాగం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ప్రస్తుతానికి ఏమీకాదుగానీ బలమైన గాలులు వీచినప్పుడు దాని ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
🚨 Patna's double-decker flyover was opened on June 11, and these kids are seen removing its nuts and bolts. A Serious Safety Hazard!
They don’t appear local, possibly Bangladeshi! pic.twitter.com/Hk0j3LTacm
— Gems (@gemsofbabus_) June 13, 2025