BigTV English

Viral Video: నూడుల్స్‌లో మొబైల్ ఫోన్ వేసి ఉడికించేశారు..చివరికి ఏమైందో తెలుసా?

Viral Video: నూడుల్స్‌లో మొబైల్ ఫోన్ వేసి ఉడికించేశారు..చివరికి ఏమైందో తెలుసా?

Viral Video: సోషల్ మీడియాలో ఇటీవల ఒక వింత వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను నూడుల్స్ వండే పాత్రలో వేసి, స్టవ్ మీద పెట్టి ఉడికించడం స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.


ఈ వీడియో క్లిప్‌లో.. మొదటగా నూడుల్స్‌ను ఉడికించడానికి నీటితో నింపిన పాత్రను స్టవ్‌పై ఉంచారు. ఆశ్చర్యకరంగా.. నూడుల్స్‌తో పాటు ఒక ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఆ నీటిలో వేసి మరిగిస్తున్నారు. ఫోన్ నీటిలో ఉడుకుతున్నప్పుడు వచ్చే ఆవిరి, బుడగలు, ఫోన్ వేడికి ఎలా ప్రతిస్పందిస్తుందో కూడా వీడియోలో రికార్డు చేయబడింది. కొన్ని నిమిషాల పాటు ఇలా నూడిల్స్ ఉడికించిన తర్వాత.. ఆ వ్యక్తి ఫోన్‌ను నూడిల్స్ పాత్ర నుండి తీసి పక్కనే ఉన్న నీటితో ఉన్న మరో పాత్రలో వేసాడు. ఈ వీడియో చూసిన వారందరూ ఎందుకు ఇలా చేశాడని ఆశ్చర్యపోయారు. కొందరు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ లేదా వ్యూస్, లైక్స్ కోసమే ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. “ఫోన్ ఎంత బాగా ఉడికింది ? తినడానికి సిద్ధంగా ఉందా?”, “ఇది ఫోన్‌ను శుభ్రం చేయడానికి కొత్త పద్ధతి అని నేను అనుకుంటున్నాను!” అని కొందరు వ్యంగ్యంగా, సరదాగా కామెంట్ చేయగా, మరికొందరు ఫోన్ లాంటి విలువైన వస్తువును అనవసరంగా నాశనం చేయడం సరికాదని, ఇది పూర్తిగా డబ్బు వృథా అని తీవ్రంగా విమర్శించారు. ఈ సంఘటన ఒప్పో ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల మన్నికపై లేదా సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను దుర్వినియోగం చేయడంపై కూడా విస్తృతమైన చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక ఫన్ వీడియోనా లేక వెనుక ఏదైనా ఉద్దేశ్యం ఉందా అనేది తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.


Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×