BigTV English

Bride Behaved Strangely: వింతగా ప్రవర్తించిన పెళ్లికూతురు.. వణుకుతు పరారైన వరుడు.. వీడియో!

Bride Behaved Strangely: వింతగా ప్రవర్తించిన పెళ్లికూతురు.. వణుకుతు పరారైన వరుడు.. వీడియో!

Bride Behaved Strangely on Wedding Stage: అక్కడ పెళ్లికి సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది. చుట్టాలంతా అక్కడికి వచ్చారు. ఎటు చూసినా ఆ వేదికంతా పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు, బంధువులతో కోలాహలంగా ఉంది. ఈ క్రమంలో అనుకోని సంఘటన జరిగింది. దీంతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు.


పెళ్లి కొడుకు అయితే అక్కడి నుంచి గజగజ వణుకుతూ పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతూ… ఏందీ భయ్యా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి కొడుకు ఆ పెళ్లి నుంచి ఇప్పుడే తప్పించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇంకొందరైతే మాకు భయమేసింది భయ్యా ఈ వీడియో చూడగానే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ చోటా పెళ్లికి సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో వేదికపైకి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వచ్చారు. చుట్టాలు కూడా భారీగానే వచ్చారు. అంతా ఆ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో అక్కడ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. దీంతో అంతా అవాక్కయ్యారు. వేదికపై పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పెళ్లికూతురు, పెళ్లి కొడుకు పూల దండలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు.


Also Read: దూడను మింగేసిన భారీ కొండచిలువ.. ముందుకు కదల్లేక..!

మొదటగా పెళ్లి కొడుకు పూల దండను పెళ్లి కూతురు మెడలో వేయబోడు.. ఈ క్రమంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు పూల దండను పెళ్లి కూతురు మెడలో వేయబోతుండగా.. ఆ పెళ్లి కూతురు ఒక్కసారిగా వింతగా ప్రవర్తించింది. కళ్లను పెద్దవిగా చేస్తూ తలను వింతగా పెట్టి పెళ్లికొడుకు వైపు వింతగా చూస్తూ గట్టిగా అరిచింది. దీంతో పెళ్లి కొడుకు గజ్జున వణుకుతూ అక్కడి నుంచి పరారయ్యాడు.

వేదికపై ఉన్న బంధువులు ఆమెను ఆమెకు ఏమైందోనని తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె ఆగకుండా అలాగే వింతగా ప్రవర్తించింది. దీంతో వాళ్లు కూడా షాక్ కు గురయ్యారు. అక్కడున్న మిగతా చుట్టాలు కూడా ఆశ్చర్యపోతూ పెళ్లి కూతురు ఇలా చేసింది. ఏమైందని చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతూ రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోబోతున్న పెళ్లికొడుకుకు పలు సూచనలు ఇస్తున్నారు. అయితే.. ఈ వింత సంఘటన ఎక్కడ జరిగింది.. ఏమిటా  వివరాలు అనేది తెలిసిరాలేదు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×